ఆరు గ్యారెంటీ లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం…! ఎంపిటిసి మంజుల దస్తప్ప

ప్రజాతంత్ర కోడంగల అక్టోబర్ 17: ఆరు గ్యారంటీ లతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని  దౌల్తాబాద్ ఎంపీటీసీ మంజుల దస్తప్ప జంగం వీరన్న రొయ్యలి  బీములు సూరారం సాయిలు జగన్ గౌడ్   గోపాల్ గౌడ్  శేఖర్ భాస్కర్  తిరుపతి రెడ్డి  మాలేకాడి అంజి అన్నారు  టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు  కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల గురించి ఆదివారం    దౌల్తాబాద్  మండల కేంద్రంలో  ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటించిన పథకాల గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించారు తెలంగాణ బడుగు,బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారిని గెలిపించి కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ను రెపరెపలాడించాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *