ఇచ్చిన హావిూ మేరకు 2లక్షల ఉద్యోగాల భర్తీ
మూసీ అభివృద్ధి, రంగారెడ్డి పాలమూరు పూర్తి చేస్తాం
ఆర్థికంగా చిన్నాభిన్నం అయిన రాష్టాన్న్రి గాడిలో పెట్టే పని
ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి
రేవంత్ ప్రభుత్వం కొత్త ఎంఎస్ఎంఇ విధానం ప్రకటించిందని, దావోస్
సమావేశంలో రూ.40 వేల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని వెల్లడిరచారు. తెలంగాణ ఇచ్చిన అప్పటి మన్మోహన్ సింగ్ సర్కారుకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందని, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ అగ్రనేత, యుపిఎ వైఎస్ చైర్మన్ సోనియాగాంధీ పోషించిన చారిత్రక పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటోందన్నారు. ప్రజాపాలనలో 1.2 కోట్ల దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించామని తమిళి సై వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామన్నారు. అర్హులైన వారికి రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందజేయనున్నట్లు తెలిపారు. కచ్చితంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైందని… దాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. యువతకు 2 లక్షల ఉద్యోగుల కల్పనపై దృష్టిపెట్టామన్నారు. ప్రజావాణిలో 1.8కోట్ల దరఖాస్తులు వచ్చాయన్నారు. రైతులు, యువత, మహిళలకు ఇచ్చిన హావిూలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మౌలిక వసతులరంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా చూస్తామన్నారు. గత సమావేశాల్లో ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తామని గవర్నర్ తమిళిసై వెల్లడిరచారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం, మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని కూడా అమలులోకి తీసుకొస్తామన్నారు. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తాం. మా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకతను పాటిస్తుంది.
గత ప్రభుత్వం నిర్వాకాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశాం. రాష్ట్రంలో ప్రత్యేక నైపుణ్య వర్సిటీలు ఏర్పాటు చేస్తాం. విద్యతో పాటు ఉద్యోగమూ సాధించేలా యువతలో నైపుణ్యాలు పెంపునకు కృషి చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, వికలాంగ పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటు అందిస్తాం. 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. సమగ్ర డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. హైదరాబాద్‌ను దేశంలోనే కృత్రిమ మేధ (ఏఐ) ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తాం. రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తాం. క్రీడారంగంలో రాష్టాన్ని అగ్రగామిగా చేయడమే మా లక్ష్యం. కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్జడెట్ కేవలం ఆర్థిక పత్రం కాదు.. భవిష్యత్‌కు నమూనా అని చెప్పారు.గవర్నర్ ప్రసంగం అనంతరం శాసన సభ, శాసన మండలి సమావేశాలు నేటికి వాయిదా పడ్డాయి. అంతకుముందు గవర్నర్ తమిళసై అసెంబ్లీకి రాగానే సిఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాదరావు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబులు వెళ్ళి స్వాగతం పలికి తోడ్కొని వచ్చారు.




