ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆలయంలో ప్రమాణం చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 27:కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తానని మహేశ్వరంనియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్ఆర్(కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి) అన్నారు.సోమవారం మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలోని శ్రీ శివగంగరాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసితాను ఎమ్మెల్యే గా గెలిస్తే చేస్తానన్న హామీలను బాండ్పేపర్ పైన రాసి ప్రమాణ పత్రాన్ని విలేకరుల సమక్షంలోనిర్వహించారు .ఈ సందర్భంగా కేఎస్ఆర్ మాట్లాడుతూ.తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుతానని అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తానన్నారు.ప్రజలకు అందుబాటులో ఉంటానని, నియోజకవర్గంలోఉన్న అన్ని సమస్యలను పరిష్కారిస్తానన్నారు.మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి కోసం పూర్తిగాఅంకితం అవుతానన్నారు. నియోజకవర్గం ప్రజలప్రయోజనాలను నడుచుకుంటానన్నారు. దృష్టిలో ఉంచుకొని మహేశ్వరం నియోజకవర్గంలోకాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా
నర్సింహ రెడ్డి, మండల అద్యక్షుడు కాకి ఈశ్వర్,గ్రామ అద్యక్షుడు అల్లే కుమార్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు జంగారెడ్డి,ప్రశాంత్ రెడ్డి,అల్లె బిక్షపతి  దత్తు నాయక్, వెంకట్ ప్రసాద్, కృష్ణారెడ్డి,నారాయణ,కృష్ణ నాయక్, కూన వెంకటేష్, గుర్రం రమేష్, మెగావత్ సేవ్యా నాయక్ తో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *