ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీకి 2022 – 2023 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం బడ్జెట్ రెండు కోట్ల 47 లక్షలు, ఇవ్వగా మార్కెట్ కమిటీకి 2. కోట్ల 65, లక్షలు ఆదాయం సమకూరినట్టు ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమనగల్లు మార్కెట్ కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 2023-2024 సంవత్సరంలో ఆదాయం బడ్జెట్ రెండు కోట్ల 13, లక్షలు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా ఇచ్చిన బడ్జెట్ ఆదాయాన్ని సమకూర్చే విధంగా సమావేశంలో చర్చించడం జరిగిందని తెలిపారు. మార్కెట్ లో అతి త్వరలో 8 కొత్త సెటర్లకు శంకుస్థాపన చేయనున్నట్లు తీర్మానించారు. అదేవిధంగా గోదాములను రిపేర్లు చేయించాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిసి రోడ్డు నిర్మించాలనీ ఈ సమావేశంలో చర్చించడం జరిగింది అన్నారు. కడ్తాల్ చెక్ పోస్ట్ ను త్వరలో ప్రారంభోత్సవం చేసుకోవాలి సూచించారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో మార్కెట్ పాలకవర్గం మార్కెట్ ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్, డైరెక్టర్లు లాయఖ్ అలీ, నిరంజన్, సుభాష్, రమేష్ నాయక్, శేఖర్, ట్రేడర్ కాసుల కృష్ణయ్య కార్యదర్శి.



