ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 9 : ఆమనగల్లు పట్టణంలో యూత్ కాంగ్రెస్ 63వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు పట్టణ అధ్యక్షులు వస్పూల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఆమనగల్లు మండల అధ్యక్షుడు అండకర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో చెంచు కాలనీలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిల్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాసరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ, వైస్ ప్రెసిడెంట్ ఖలీల్ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంగ్లీ రాములు, పట్టణ అధ్యక్షులు వస్పుల మనయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు వస్పుల శ్రీశైలం, శేఖర్, తాలుక కార్యదర్శులు రాఘవేందర్, అలీం, సురేష్ ,రామంతల సర్పంచ్ శ్రీరాములు, పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఖాదర్, కరీం, నగేష్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు ఫరీద్, తోట శ్రీను, దుడ్డు కృష్ణ, మహేష్ , గాజుల కృష్ణయ్య గాజుల సురేష్, శ్రీధర్, మహేష్ , రామలింగం, సురేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.


