ఆమనగల్లు లో బిఆర్ఎస్ భారీ బైక్ ర్యాలీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 28 : ఆమనగల్లు పట్టణంలో మంగళవారం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆమనగల్లు పట్టణంలోని పురవీధుల గుండా సాగిన ర్యాలీ హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై చేరుకుంది. కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి  జైపాల్ యాదవ్ ర్యాలీలో పాల్గొని ప్రజలకు అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్యా నాయక్, ఆమనగల్లు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్, మండల పరిషత్ వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి, కోట పెద్ద శ్రీను, ఖలీల్, దుడ్డు ఆంజనేయులు, కవటం రాధమ్మ వెంకటయ్య, సోనీ జయరాం, గుత్తి బాలస్వామి, నాగిళ్ల జగన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *