ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : ఆమనగల్లు మండల ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఫోటోగ్రాఫర్లు ఆమనగల్లు పట్టణంలోని హైదరాబాద్ – శ్రీశైలం రహదారి గుండా బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ సత్యం, ఎమ్ఎ పాష, శ్రీశైలం, వెంకటేష్, జావేద్, గిరి, వెంకటేష్, గణేష్, అలీం, బిక్కు, విజయ్, శివ కుమార్, శ్రీకాంత్, వీరితోపాటు ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.



