ఆమనగల్లులో 13వ రోజుకు చేరిన అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  అంగన్వాడీ టీచర్స్ ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయ సమీపంలో చేస్తున్న నిరోధిక సమ్మె శనివారంతో 13వ  రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మె సందర్భంగా పలువురు మాట్లాడుతూ  అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,వేలు  పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత పలు సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వము ఎన్నో ఏళ్లుగా అంగన్వాడీ ఉద్యోగుల పట్ల మొండి వైఖరి వ్యవహరిస్తుందని తక్షణమే వారి సమస్యలు పరిష్కరించి సమ్మె విరమించేలా సహకరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, అలివేలు, మేడిగడ్డ సరోజ, రాజ్యలక్ష్మి, సంధ్య, లక్ష్మమ్మ, శాంతమ్మ, కే అలివేలు, రజిత, నాగశిరోపాణి, స్వరూప, నాజిమా, నూరునిస్సా బేగం, సువర్ణ, అంజమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *