ఆమనగల్లులో గాంధీ చిత్రాన్ని తిలకించిన ఎమ్మెల్యే

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : ఆమనగల్లు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర, సాయిరాం థియేటర్ లలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులతో కలిసి గాంధీ చిత్రాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కమిషనర్ శ్యాంసుందర్ లతో కలిసి తిలకించారు. ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు ఆమనగల్లు పట్టణంలోని థియేటర్లలో ఆమనగల్లు, మాడుగుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ తరఫున ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అంతకుముందు విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే అభినందనలు తెలిపి షేక్ హ్యాండ్ ఇచ్చి థియేటర్లోకి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విజయకృష్ణ కోఆప్షన్ పాష, ఎంఈఓ సర్దార్ నాయక్, సిఆర్పి షేక్ అహ్మద్, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *