ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళ సై ఆమోదం తెలపడం పట్ల హర్షిస్తూ గురువారం ఆమనగల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వివిధ డిపోలో చెందిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ లు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచి పెడుతూ ఆనందంతో మునిగిపోయారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు జగదీశ్వర్, బైకనీ నరసింహ, జి మహేష్, యాదయ్య, వెంకటయ్య, అమీర్ ఖాన్, వెంకటయ్య, తదితరుల పాల్గొన్నారు.




