ఆధ్యాత్మికత – ప్రేమానంద

.‘‘ఏ మతంలోనైనా, ఉత్తి ఆచారాల ద్వారా, తంతుల ద్వారా, మానవ ప్రవర్తనను మంచి వైపు మరల్చడం కష్టం. తమను తాము భగవదవతారంగా చెప్పుకునే వాళ్లు చాలా మంది, ఆధ్యాత్మికతను ప్రచారం చేసే బదులు, బాహిర వ్యక్తీకరణల ద్వారా, అంటే విభూతి సృష్టించడం, ఇతర భౌతిక పదార్థాలు తయారు చేయడం ద్వారా ప్రజల మనసులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనసు ఇటువంటి వాటిని నమ్మడం మొదలుపెట్టిన తర్వాత, ఇక కొత్త భావాలను, ఆలోచనను లోపలికి రానిచ్చే మనో కవాటాలు  మూసుకుపోతాయి ’’

ప్రేమానంద కేసు విషయానికి వస్తే, ముఖ్యమైన విషయమేమంటే, ఇటువంటి అతీంద్రియ శక్తి ఒక బూటకమని న్యాయస్థానంలో నిరూపించడం. జడ్జి భానుమతి ఈ పనిని విచారణ క్రమంలో సమర్థంగా చేసి చూపారు. ‘‘ఏ మతంలోనైనా, ఉత్తి ఆచారాల ద్వారా, తంతుల ద్వారా, మానవ ప్రవర్తనను మంచి వైపు మరల్చడం కష్టం. తమను తాము  భగవదవతారంగా చెప్పుకునే వాళ్లు చాలా మంది, ఆధ్యాత్మికతను ప్రచారం చేసే బదులు, బాహిర వ్యక్తీకరణల ద్వారా, అంటే విభూతి సృష్టించడం, ఇతర భౌతిక పదార్థాలు తయారు చేయడం ద్వారా ప్రజల మనసులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనసు ఇటువంటి వాటిని నమ్మడం మొదలుపెట్టిన తర్వాత, ఇక కొత్త భావాలను, ఆలోచనను లోపలికి రానిచ్చే మనో కవాటాలు  మూసుకుపోతాయి ’’ అని ఆమె రాశారు. ఇది చాలా తెలివైన పద్ధతి. తరతరాలుగా వృత్తులలో ఉన్న వారు ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఉపయోగిస్తున్న పద్ధతి ఇదే. న్యాయవాదులం కూడా ఈ పద్ధతి చాలా ఎక్కువగా వాడతాం. ఇది మన వృత్తిలో మనం నిలిచి ఉండడానికి, ఇతరులను ఓడిరచడానికి ఒక మార్గం. ఆ క్రమంలో ఆ వ్యక్తి చుట్టూ ఏర్పాటు చేసుకునే బృందం ఆయనను ఆధ్యాత్మిక గురువు, మనసు నుంచి అజ్ఞానపు పొరలను తొలగించే సమర్థుడనీ పిలుస్తుంటారు.

ప్రేమానందకు తెలిసిన లింగోద్భవ విద్య నిజానికి కొత్తదేమీ కాదు. కడుపులో నుంచి లింగాలు పుట్టించడం చాలా ప్రఖ్యాతమైన విద్య. ఆయనకన్నా ముందు  ఎందరో స్వాములు ఈ మాదిరిగానే లింగాలను సృష్టించారు.
ఈ లింగోద్భవం గురించి 1970లో ప్రఖ్యాతమైన సంఘటన ఒకటి ఉంది. అప్పుడు నీలకంఠ బాబా అని ఒక బాబా ఉండేవాడు. ఆయన తన కడుపులో నుంచి ఒక లింగాన్ని సృష్టించి అప్పటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌కు ఇచ్చానని ప్రకటించుకున్నాడు. ఆ మాదిరిగానే శూన్యం నుంచి స్ఫటిక లింగాలను సృష్టించి అప్పటి మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌కూ, ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీకి చెరి ఒకటి బహూకరించానని చెప్పుకున్నాడు. వాళ్లిద్దరూ తనను దర్శించుకున్నప్పుడు ఈ బహుమానాలు ఇచ్చానని కూడా అన్నాడు. ఈ విషయం వాస్తవమేనా స్పష్టం చేయవలసిందిగా కోరుతూ సుప్రసిద్ధ హేతువాది డా.అబ్రహాం కోవూర్‌ 1973 నవంబర్‌ 18న శ్రీమతి ఇందిరాగాంధీ ఒక లేఖ రాశారు. ఆమెకు అప్పుడు వ్యక్తిగత కార్యదర్శిగా ఉండిన టి.ఎన్‌. శేషన్‌ ఆ లేఖకు నవంబర్‌ 22న జవాబు రాశారు. ‘‘ప్రధాన మంత్రి నీలకంఠ బాబాజీని కలిశారనే కథతోగాని, ఆయన శూన్యం నుంచి లింగాన్ని సృష్టించి ఆమెకు ఇచ్చారనే కథలోగాని వాస్తవం లేదని మీకు జవాబు రాయమని ప్రధాన మంత్రి నన్ను ఆదేశించారు’’ అని ఆ జవాబు. దొంగబాబాల ప్రగల్భాలు ఇట్లా ఉంటాయన్నమాట.

చుట్టూ ఉన్న పరిస్థితులు సాధారణంగా హేతుబద్ధంగా ఉండే వారికి కూడా మతి పోగొట్టేలా ఉన్నప్పుడు సాంప్రదాయక మత విశ్వాసాలు ఘోరంగా విఫలమవుతున్నప్పుడు ప్రేమానంద ఆశ్రమం ఒక నిరాశాపూరితమైన, చీకటి నిండిన తాత్విక దృక్పథాన్ని ప్రచారం చేసిందని న్యాయమూర్తి భానుమతి అన్నారు. ప్రేమానంద ప్రకటించుకున్న ఆధ్యాత్మిక శక్తులనబడే వాటి బండారం బట్ట బయలు చేయడానికి న్యాయమూర్తి మరుదువ­త్తు అనే ఒక ఇంద్రజాలికుడిని పిలిపించి న్యాయస్థానంలో లింగోద్భవం ప్రదర్శన ఏర్పాటు చేయించారు. ఆ ఇంద్రజాలికుడు భగవంతుడి అవతారమని చెప్పుకోవడం లేదు. కాని లింగోద్భవం చేయగలడు. నిండు న్యాయస్థానంలో మరుదువ­త్తు తన కడుపులో నుంచి లింగాన్ని సృష్టించాడు. ఖాలీగా ఉన్న అరచేతుల్లో నుంచి విభూతి సృష్టించాడు. అదంతా గారడీ విద్య మాత్రమేనని చెప్పాడు. మరుదవ­త్తు ఈ గారడీ ఎట్లా చేశాడు? ఆయన మొదట రెండు కుంకుమ నింపిన కాప్స్యూల్ మింగాడు. ఆ తర్వాత ఒక మూడు అంగుళాల లింగాన్ని ఒక అరటిపండు లోపల కనపడకుండా దాచి పెట్టి ఆ అరటిపండును మింగేశాడు. తర్వాత అరగంట సేపు విశ్రాంతి తీసుకుని కుంకుమ అంటుకున్న లింగాన్ని బయటికి తీశాడు.
ఈ ప్రదర్శన న్యాయస్థానంలో అందరూ చూస్తుండగానే జరిగింది. ఆధ్యాత్మిక శక్తులు అనబడే వాటి వెనుక ఉన్న అబద్ధాన్ని ఈ పద్ధతిలో బహిరంగంగా ప్రదర్శించి బట్టబయలు చేయకుండా ఉంటే ప్రేమానంద విచారణ సక్రమంగా జరిగి ఉండేది కాదు. ఇటువంటి చర్య వల్లనే ఇతర సాక్షులు కూడా ధైర్యంగా నిలబడి తమ సాక్ష్యం చెప్పగలిగారు.

మన న్యాయవ్యవస్థలో అతి తక్కువ మంది న్యాయమూర్తులకు  ఇటువంటి ప్రదర్శన జరపాలని అనిపించి ఉంటుంది. అలా అనిపించిన వాళ్లలో కూడా ధైర్యంగా దాన్ని అమలులో పెట్టేవాళ్లు ఇంకా తక్కువ మంది న్యాయమూర్తులు ఇటువంటి ప్రదర్శనలను న్యాయస్థానం హాలులోపల అనుమతిస్తారు. ఈ సందర్భంలో న్యాయ విచారణాక్రమంలో న్యాయమూర్తి ఆధ్యాత్మికతను, మత విశ్వాసాలను ప్రశ్నించకుండానే, విశ్వాసానికి, సంబంధించిన వ్యవహారాలతో న్యాయస్థానంలోపలనే ఒక సృజనాత్మక సంభాషణలోకి దిగారు. ఆధ్యాత్మిక శక్తి అనబడేదాన్ని నిరాయుధం  చేసి దానికీ నేర ప్రవర్తనకూ సంబంధాన్ని నిర్ధారించారు. అసలు ప్రేమానంద ఆశ్రమానికి సంబంధించిన దారుణాల కథ ఇద్దరు యువతులు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి చెన్నైలోని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఎఐడిడబ్ల్యుఎ) సభ్యుల సహాయం కోరడంతో వె­దలైంది. పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీ యూ సిఎల్‌) న్యాయవాదులు సుధా రామలింగం, నాగశైల, వి సురేష్‌ ఆ బాధితులకు సహాయం అందించడమే గాక ప్రాసిక్యూషన్‌కు కూడా సహకరించారు. వీరిలో సుధా రామలింగం మహిళా సమాఖ్య సభ్యురాలు కూడా

-కె.జి. కన్నబిరాన్‌

ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *