ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వల్మిడి ఆలయ నిర్మాణం

  • రాముడు నడయాడిన నేల
  • కమనీయంగా రాములోరి కల్యాణం
  • శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజియర్‌ ‌స్వామి చేతుల మీదుగా విగ్రహా పున:ప్రతిష్టాపన
  • భదాద్రి, ఆయోధ్యలకు ధీటుగా వల్మిడి అభివృద్ధి
  • అంతా తానై ముందుండి నడిన పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • హాజరైన మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌

పాలకుర్తి, ప్రజాత్రత, సెప్టెంబర్‌ 4 : ‌వల్మిడి శ్రీసీతారామంచంద్రస్వామి ఆలయం హరి హరనామ స్మరణతో మారుమోగింది. ఆద్మాత్మికత ఉట్టిపడింది. రాముడు నడయాడిన నేలన పంచాయతిరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్ని తానై ముందుండి ఆలయ నిర్మాణం చేపట్టి ఆంగరరంగ వైభవపేతంగా స్వామివారి కల్యాణం జరిపించారు. సోమవారం ఉదయాన్నే డోలు వాయిద్యాలతో, డప్పుచప్పుల్లతో మహిళలు కోలాటాలతో ఆలయ పూజారులతో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయరస్వామికి, పంచాయతీ రాజశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకి  పూర్ణకుంబం అందించి ఘనంగా స్వాగతించి కొండపైకి తీసుకెల్లారు. అత్యంత దేదిప్యమానాంగ అంగరంగ వైభవోపేతంగా నిర్మించిన ఆలయంలో భక్త జనుల హరిహర నామ స్మరణల నడుమ చిన్నజీయరస్వామి వేదమంత్రో చ్ఛారణలతో రాములోరి విగ్రహాన్ని నిర్మంపచేశారు.

ఆలయంలో వాల్మికి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనితో రాష్ట్ర నలుమూలనుంచి అశేశ భక్త జనం తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని తరించారు. మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతిష్టాపనకరు మంత్రులు తన్నీరు హరీషరావు, ఇంద్రకరుణకరరెడ్డి, సత్యవతిరాథోడ్‌, ‌మాజీ ఉపముఖ్యమంత్రి శాసన మండలి సభ్యులు కడీయ శ్రీహరి,  ఆరోగ్య శ్రీ ఛైర్మన్‌ ‌డాక్టర ఎన, సుధాకర్‌రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సిరిసిల్ల రాజయ్య, ఆరూరి రమేష్‌, ఎం‌పీ దయాకర్‌ ‌మైహోం ఆధినేత రామేశ్వరరావు, జిల్లా కలెక్టర్‌ ‌శవలింగయ్య, ఆదనపు కలెక్టర్లు పాల్గ్గొనగా ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్‌ ‌జైహిందు, దర్మకర్తలు, వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన స్వామివారి కల్యాణానికి హజరై మాట్లాడారు.

సమాజానికి దేవాలయాలు ఎంతో అవసరం…భదాద్రి, ఆయోధ్యలకు ధీటుగా వల్మిడి ఆయల అభివృద్ధి
చిన్నజీయర స్వామి తన భౄషణంలో..సమసమాజానికి నిర్మాణానికి దేవాలయాలు ఎంతో ఉపకరిస్తాయని, అందుకు అనుగుణంగా వల్మిడి ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. వల్మిడికి ఎంతో ప్రాచుర్యముందన్నారు. ఎంత ఎండకాలమైనా ఎండిపోయి గుండము ఇక్కడ ఉండడం దానికి నిదర్మనం అన్నారు. కులమతల తారతమ్యం, చిన్న పెద్ద తేడాలు లేకుండా ఉండేందుకు ఆలయాలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. దేశాన్నేలే రాజనై, హళం పట్టి పోలం దున్నే రైతైనా భగవంతుని దగ్గర చేతులెత్తి తల దించి దండం పెట్టాల్సిందే. మనమంతా భగవంతునికి బందువులేమే అని వెయ్యేళ్ల క్రితమే సమతామూర్తి తెలియాజేశారన్నారు. మనుషులందరిని కలిపేందుకు, సామాజికి భావాన్ని పెంచేందుకు దైవం కావాలన్నారు. భక్తి భావం నిండుగా ఉన్న రాఫ్ట్ర ముఖ్యమంత్రి ఉండడంతో దైవ కార్యాలను జరుపుకుంటున్నామన్నారు. ఎంతో శ్రమించి ఈ ఆలయాన్ని అత్యంత వైభవ పేతంగా నిర్మింపజేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, వారికి సహకారించిన వారంత పూణ్యమూర్తులని కొనియాడారు. ఎక్కడ రామనామం ఉంటతో అక్కడ సభిక్షంగా ఉంటుందన్నారు. పక్కనే ఉన్న కొండపై సమాతా మూర్తి విగ్రహాన్ని నెలకొల్పాలని సూచించారు.

సీఎం కేసీఆర్‌ ‌దీవెనతోనే ఆలయాల అభివృద్ధి : మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు దీవేనలతోనే ఇంతటి మహాత్తర కార్యాన్ని చేపట్టగలిగామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ప్రపంచ ప్రసిద్దిగాంచిన భగవతాన్ని రాసీన బమ్మెర పోతన, తొలితెలుగు కవి పాల్కురికి సోమనాధుడు, రామాయనాన్ని రాసీన వాల్మికి పాలకుర్తి ప్రాంతం వారు కావడం ఎంతో ఆద్రుష్టమన్నారు. ఇంతటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఎమ్మెల్యేగా ఉండడం అద్రుష్టమన్నారు. పుణ్యక్షేత్రాల అభివృద్దికి సీఎం కేసీఆర్‌ను కలిసి చెప్పగానే నిధులిచ్చి దివించారన్నారు. సీఎం కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీష్‌రావుల సహకారంతోనే ఇంతటి పుణ్యకార్యాన్ని చేయగల్గిమని స్పష్టం చేశారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు నాయకుల కృషి ఎంతో ఉందన్నారు. అనేక మంది భక్తులు చందాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన మంత్రులకు, దాతలకు చినజీయర స్వామిచే ఆశీర్వచనాలను అందజేయించారు.

పాలకుర్తిని సస్యశ్యామలం చేశాడు ఎర్రబెల్లి : మంత్రి హరీష్‌ ‌రావు ప్రశంస
పంచాయతిరాజ శాఖ మంత్రి ఎరబ్రెల్లి దయాకరరావు అనుకున్నడంటే అది సాధించేవరకు వదలడని దానికి వల్మిడి ఆలయ నిర్మాణమే నిదర్శనంగా నిలుస్తుందని మంత్రి హరీష్‌రావు కొనియాడారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వల్మిడి ఆలయన నిర్మణం జరిగిందన్నారు. 24వేల శ్లోకాలతో 7భాగాలుగా రామాయానాన్ని రాసిన వాల్మికి నడయా వాల్మికి పురంలో ఇంతటి ప్రసిద్దిగాంచిన నిర్మాణాలు చేపట్టడం గొప్పవిషయమన్నారు. భగవంతున్ని భాగా నమ్మె సీఎంగా కేసీఆర్‌ ఉం‌డడంతోనే ఆయన ఆశీస్సులు ఎర్రబెల్లికి మెండుగా ఉన్నాయి కాబట్టే ఇది నిర్మాణం చేయగలిగారన్నారు. అంతటి భక్తి భావం ఉన్న కేసీఆర్‌ ‌సీఎం ఉన్నాడు కాబట్టే ఈరోజు ఆలయాలకు పూర్వవైభవం తెస్తు దూపదీప నైవేద్యాలకు ఆర్చకులు పదివేలు ఇస్తున్నారన్నారు.

రాష్ట్రంలో ఆనేక ఆలయాలను యాదాద్రి వంటి ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్దే ఎర్రబెల్లికి ప్రథమ ప్రాధాన్యమన్నారు. సిద్దిపేటతో పొటీపడి అభివృద్ధి చేయాలని తాపత్రయ పడుతారన్నారు. ఎంతో కష్టపడి ప్రజల కోసం పని చేసే నాయకుడన్నారు. అందుకు ఎన్నో అవార్డు సాధించారని కొనియాడారు. ఎర్రబెల్లి కోరిక మేరకు రూపవే నిర్మాణం సీఎం దృష్టికి తీసుకెల్లి మంజూరి చేయిస్తానన్నారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ వందల ఏళ్లు మంత్రి ఎర్రబెల్లి దాయకరరావు పేరు చిరస్మరనీయంగా నిలుస్తుందన్నారు. ఇంతటి ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టి ఎంతో పుణ్యం చేసుకున్నారన్నారు. పాలకుర్తిని టూరిజం ప్లేస్‌గా అభివృద్ధి చేశారన్నారు.

రాములోరి గుట్ట నుంచి మునుల గుట్టకు రూప వేకు నిధుల గూర్చి సీఎం కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెల్లి నిధులు వెచ్చిస్తామని తెలిపారు.  అనంతరం మంత్రి సత్యవతి రాథోడు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి రాష్ట్రంలో అనేక ఆలయాలను పునర్‌నిర్మాణము చేపట్టారన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పాలకుర్తి ప్రాంతాన్ని తీర్చిదిద్దిన మంత్రి ఎర్రబెల్లి ఎంతో పుణ్యమూర్తియన్నారు. సమాజం మంచి మార్గంలో, భక్తి మార్గంలో నడిచేందుకు ఇటువంటి ఆలయాలు ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో వల్మిడి సర్పంచి కత్తి సైదులు, ఎంపీటీసీ తాల్లసోమనారాయణ, ఆలయ చైర్మన జహిందు, దర్మకర్తలు, ఆలయ ఈవో లక్ష్మీ పసన్న, పాలకుర్తి ఆలయ ఈవో రామచంద్రయ్య శర్మ వివిధ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధతు, పార్టీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *