ఆధార్‌-‌పాన్‌ ‌లింక్‌ ‌గడవు పొడిగింపు

న్యూ దిల్లీ, మార్చి 28 : పాన్‌ ‌కార్డుకు ఆధార్‌ ‌నెంబర్‌ ‌లింక్‌ ‌చేసే గడువును కేంద్రం పొడిగించింది. పాన్‌-ఆధార్‌ ‌లింక్‌ ‌గడువు  తేదీని జూన్‌ 30 ‌వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. పన్ను చెల్లింపుదారులకు ఇంకొంతకాలం సమయం ఇచ్చేందుకు గడువు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆధార్‌ ‌నెంబర్‌ను మార్చి 31లోగా పాన్‌ ‌కార్డుకు లింక్‌ ‌చేయాలని తెలిపింది. ఏప్రిల్‌ 1 ‌నుంచి ఆధార్‌ ‌నెంబర్‌ ‌లింక్‌ ‌చేయని పాన్‌ ‌కార్డులు చెల్లవని హెచ్చరించింది.

తాజాగా దానిని  జూన్‌ 30 ‌వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పాన్‌-ఆధార్‌ ‌లింక్‌ ‌గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని, రూ. 1000 రుసుమును కూడా తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ లోక్‌సభలో కాంగ్రెస్‌ ‌నేత అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదరి ప్రధాని  నరేంద్ర మోడీకి లేఖ రాసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. మార్చి 31, 2022కి ముందు ఆధార్‌-‌పాన్‌ ‌లింకింగ్‌ ఉచితంగా ఉండేది. ఏప్రిల్‌ 1, 2022 ‌నుండి రూ. 500 రుసుము విధించబడింది.ఆ తరువాత జూలై 1, 2022 నుండి రూ. 1,000కి పెంచబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *