ఆదివాసీల హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు

ఆదివాసీ గిరిజన జీవన విధానం ఇంతకు ముందు పూర్తి ప్రత్యేకతను సంతరించుకుంటే, ఈ మధ్యన బయటి ప్రపంచంతో సంబంధాలు పెరిగిన తరువాత మార్పులు త్వరితంగా వస్తున్నాయి. కొన్ని మంచిని కలిగించే మార్పులయితే, మరికొన్ని వారి ప్రాంతాలను జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి భారత రాజ్యాంగం,లో 5 వ షెడ్యూల్‌ ‌ప్రత్యేక చట్టాలు గిరిజనులకు అన్ని విధాలైన రక్షణలు కల్పిస్తూ, వారు హుందాగా బతికేలా చేసి, బయటి ప్రాంతాలతో వారు నివసించే ప్రాంతాలను సమానంగా అభివృద్ది చెయ్యాలని చెబుతుంటే, అందుకు విరుద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు గిరిజనుల మౌలిక అస్తిత్వాన్ని దెబ్బతీసేలాగ కనిపిస్తున్నాయి. ఈ మధ్యన సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలు ముమ్మరం కావటంతో గిరిజన ప్రాంతాలలోని సహజ వనరులపై దాడి ఎక్కువ అవుతోంది. గిరిజనులు నిరాశ్రయులు అవుతున్నారు. సరళీకరణ అనంతర గిరిజనుల జీవన విధానాలను పరిశీలిస్తే ఆదివాసీల జీవితాలు కడు దుర్భరంగా మారాయి.

దేశంలో అత్యధిక గిరిజన జనాభా వున్నాప్రాంతాలైన మధ్యప్రదేశ్‌ ‌ఛత్తీస్‌ ‌ఘడ్‌, ‌ఝార్ఖండ్‌ ఒడిశా రెండు తెలుగు రాష్ట్రల్లోఆదీవాసీ గిరిజనుల జీవన విధంగా పాతాళం లోకి నెట్టివేయబడుతుంది , అటవీ చట్టాలు అమలు పేరుతో అమాయక ఆదీవాసీలను అడవుల నుంచి గెంటివేసే కుట్ర జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ లో ఈ దాష్టికం మితి మీరుతుంది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జిల్లాలు మండలాలు పునరేకీకరణతో షెడ్యూల్‌ ‌ప్రాంతాలను చిన్నాభిన్నం చేస్తూ ఆదివాసీ స్వయం పాలన హక్కులను కాలరాసే విధంగా చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం ఆదిలాబాద్‌ ‌మహబూబ్‌నగర్‌, ‌వరంగల్‌ ‌జిల్లాలో 1165 షెడ్యూలు గ్రామాలూ వున్నాయి ఆదీవాసీలు అధికంగా వున్నా 247 గ్రామాలను ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం షెడ్యూల్‌ ‌గ్రామాలుగా ప్రకటించామని కేంద్రానికి ప్రతిపాదన పంపించింది కేంద్రం దీనిపై ఫైల్‌ ‌పుటప్‌ ‌చేసి (18014/1/2014) పరిశీలిస్తుండగానే రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధంగా షెడ్యూల్‌ ‌మండలాలు, గిరిజన ఉప ప్రణాళిక మండలాలు,మైదాన ప్రాంత మండలాలను కలిపి నూతన జిల్లాలు ఏర్పాటు చేసింది దీనితో గతంలో వున్నా ఏజెన్సీ హక్కులు పూర్తి గా కాలరాయబడ్డాయి.

భూరియా కమిటీ సిఫార్సుల అనంతరం షెడ్యూల్‌ ‌ప్రాంతాలను స్థానిక పాలనా కోసం కేంద్ర ప్రభుత్వం పంచాయతీ విస్తరణ చట్టం(పీసా) 1996 ను తీసుకువచ్చింది గ్రామా సభల ద్వారానే కొత్త వాటిని విలీనం చేసే అవకాశం ఉన్నపటికీ దీన్ని అమలు చేయడంలో రాష్ట్రం విఫలం చెందింది ఇది ఇలావుండగా భూ ప్రక్షాళన పేరుతో 153 జీవో జారీ చేసింది అంతకుముందే 2004 లో మావోయిస్టు పార్టీ చర్చల సందర్భంగా మిగులు భూముల పంపిణి గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరుల పెత్తనం పై చర్చించగా ఆనాటి ప్రభుత్వం ఉమ్మడి ఎపి లో కోనేరు రంగ రావు కమిటీ ద్వారా ప్రతి జిల్లాలోని లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆదీవాసీ ప్రాంతాల్లో అంతే మిగులు భూమి ఉందని అది గిరిజనేతరుల కబంధ హస్తాలలో ఉందని నివేదిక తేటతెల్లం చేసింది. 2014 లో వచ్చిన భూ ప్రక్షళతో గిరిజన ప్రాంతాలలో వున్నా గిరిజనే తరులుకు వరంలా మారి 153 జిఓ ను అడ్డం పెట్టుకొని వేళా ఎకరాల అటవీ గిరిజన భూమిని క్రమబద్దీకరించుకొని పాస్‌ ‌బుక్కు లు చేసుకొని గిరిజన భూములలో ప్రభుత్వపథకాలు తీసుకుంటున్నారు.ఈ నక్క ఉపాయాలు తెలియని అమాయక గిరిజనులు కొన్ని ప్రాంతాలలో తరతరాలుగా తమ కుటుంబ జీవనం కోసం పోడు చేసుకొని భూములను అటవీ అధికారులు ఆక్రమించుకొని ట్రెంచులు తీస్తూ అమాయక గిరిజనులను హింసిస్తున్నారు.

వారి హింసను తట్టుకొని వున్నా గిరిజన రైతులపై వారు నివసించే ప్రాంతాలపై ప్రభుత్వమే పులులు ను వదిలి ఆయా ప్రాంతాలను టైగర్‌ ‌జోన్లు గా మార్చి ఆదివాసీలను తరిమివేసే కుట్రకు పూనుకుంటున్నారు (ఉమ్మడి వరంగల్‌ ఏటూరునాగారం ములుగు భూపాలపల్లి) ప్రాంతాల్లో ఈ సర్వే చాపకింద నీరు సాగుతుంది.అంతేకాకుండాఈ ప్రాంతాలలో విలువైన ఖనిజ సంపదను బడా కంపెనీలకు దారాదత్తం చేసే విధంగా ప్రణాళికలు సాగుతున్నాయి. ఆదివాసీల స్వయంపాలన ఉద్దేశించిన షెడ్యూల్‌ ‌ప్రాంత పంచాయతీ విస్తరణ చట్టం (పేసా )1996 ను తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదు. అటవీ హక్కులు చట్టం కింద గ్రామా సభలకు లభించిన అధికారాలను అమలు కాకుండా ప్రభుత్వమే మోకాలడ్డుతోంది. ఆంధ్ర పెట్టుబడి దారులపై పోరాడి హక్కులు స్వీయ పాలనాధికారాన్ని సాంస్కృతిక హక్కులను సాధించుకున్న తెలంగాణరాష్ట్రంలో రాజ్యాంగం గుర్తించిన ఆదివాసీలను స్వయం పాలనాధికారాన్నే కాక వారి ఉనికిని సైతం దెబ్బతీసే కుట్ర జరగడం చాల అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వ విధానం వాళ్ళ అమా యకపు ఆదివాసీ జీవనాన్ని ఛిద్రం చేస్తూ ఇవ్వాళా 153 జిఓ రేపు మరొక ఉత్తర్వు కోనసాగుతూనే ఉంటాయి, ఆదివాసీ వ్యతిరేక విధానాలను ప్రతిఘటించకపోతే తెలంగాణాలో ఆదివాసీలు తమ హక్కులనే కాదు సాంస్కృతిక ఉనికిని సైతం కోల్పోయే ప్రమాదం పొంచి వుంది.

– ముఖేష్‌ ‌వీరంటి, ఎం ఏ ఎంసీజే (జర్నలిస్ట్)
‌మహబూబాబాద్‌ ‌జిల్లా, 9398236146

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *