ఆదాయం పెంచే మార్గాలను ఆన్వేశించండి

  • పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ‌దరఖాస్తులను పరిష్కరించండి
  • మంత్రులతో కలిసి వివిధ శాఖాధికారులతో డిప్యూటీ సిఎం భట్టి సమీక్ష
  • ఖజానా లోటు భర్తీకి ప్రభుత్వం కసరత్తు
  • ఆస్తిపన్ను మదింపు..వాటర్‌ ‌బిల్లులపై నజర్‌..ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు జిహెచ్‌ఎం‌సి కసరత్తు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని అధికారులను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సవి•క్షా• సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్‌, ‌రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును సవి•క్షించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఎక్సైజ్‌ ‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఇక ఖజానా లోటుపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఆదాయ మార్గాలపై అన్వేషణ చేపట్టింది. ఆదాయం పెంచుకుంటే తప్ప అప్పులకు వడ్డీలు కట్టలేని దుస్థతి ఏర్పడిన క్రమంలో వివిధ శాఖల అధికారులతో డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి సవి•క్షించారు. ఈ సందర్భంగా  ఎల్‌ఆర్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి మాట్లాడుతూ…ఈ దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, పెండింగ్‌లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఈ పక్రియ ప్రారంభమైందని, సంబంధిత దరఖాస్తులను పూర్తి చేయడంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ‌ముందే దరఖాస్తులు పూర్తిచేయకపోవడానికి గల కారణాలపై సవి•క్షించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ పక్రియను త్వరగా పూర్తి చేసి ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని కోరారు. పూర్తిగా అర్హత ఉన్న స్థలాలకే ల్యాండ్‌ ‌రెగ్యులరైజేషన్‌ ‌స్కీమ్‌ అమలు చేయాలని, ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఈ పథకం కింద ప్రయోజనం పొందే ప్రమాదం పొంచి ఉందని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. సవి•క్షలో భాగంగా గత రెండు నెలల ఆర్థిక ప్రగతిని సవి•క్షించారు. ఆ తర్వాత బ్జడెట్‌ అం‌చనాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలలు కనబరిచిన పనితీరును సవి•క్షించి ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరచుకోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుని ఎలాంటి లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌విభాగాన్ని పటిష్ట పరిచి బ్జడెట్‌ అం‌చనాలను అందుకోవాలని వివరించారు. ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖలో వేసిన కమిటీ పనితీరును డిప్యూటీ సీఎం భట్టి అడిగి తెలుసుకున్నారు. ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్‌ ‌టాక్స్ ‌విభాగాల్లో తరచూ సవి•క్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆర్టీసీ ప్రస్తుతం వివిధ బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేటును సవి•క్ష చేసుకుని, తక్కువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు రుణాలు బదలాయింపు చేసుకుని ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇటీవల సింగరేణిలో చేసిన ఈ ప్రయోగం ద్వారా వందల కోట్ల ప్రయోజనం చేకూరిన విషయాన్ని ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులకు వివరించారు. హౌసింగ్‌ ‌బోర్డ్, ‌రాజీవ్‌ ‌స్వగృహ పథకాల ద్వారా నిర్మించిన ఇల్లు, వొచ్చిన ఆదాయం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ విక్రయించని ఇల్లు, ఇళ్ల స్థలాలు వాటి పరిస్థితిని సవి•క్షించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్యుడు సంతృప్తి చెందడమే ప్రధాన లక్ష్యమని అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను నెలవారి చెల్లించే పద్ధతిని ఆచరణలో పెడుతున్నట్టు తెలిపారు.

ప్రభుత్వ హాస్పిటల్‌లో అమలు చేస్తున్న ప్యాకేజీల ధరలకే ప్రైవేటు హాస్పిటల్‌లో ఆయా చికిత్సలు అందించేందుకు వారిని ఒప్పించాలని, ఈ పథకం సామాజిక బాధ్యతలో భాగమని వారికి వివరించాలని, వారితో చర్చలు జరపాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు. ఈ సమావేశంలో స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ రామకృష్ణారావు, కమర్షియల్‌ ‌టాక్స్ ‌కమిషనర్‌ శ్రీ‌దేవి, రవాణా శాఖ కమిషనర్‌ ‌బుద్ధ ప్రసాద్‌, ఆర్థిక శాఖ జాయింట్‌ ‌సెక్రెటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్‌ ‌సెక్రటరీ కృష్ణ భాస్కర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.ఆస్తిపన్ను మదింపు..వాటర్‌ ‌బిల్లులపై నజర్‌..ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు జిహెచ్‌ఎం‌సి కసరత్తు ఆస్తులు, భవనాల సమగ్ర సర్వే చేయాలని జిహెచ్‌ఎం‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి, నీరు, ఇతర పన్నులను సంబంధించి సమర్థవంతంగా రికవరీ చేయడానికి..డిఫాల్టర్లను మెరుగ్గా ట్రాకింగ్‌ ‌చేయడానికి జిఎస్‌ఐ ఆధారిత సర్వేకు గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా..ప్రతీ ప్లాట్‌, ‌భవనం యొక్క సరిహద్దులను తెలుసుకోవడానికి సిటిజన్‌ ‌సెంట్రిక్‌ ‌సర్వీస్‌తో ఉపగ్రహ డేటా, డ్రోన్‌లను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

ఈ సందర్భంగా ఆస్తులను తక్కువ అంచనా వేయడం, పన్నులు ఎగవేస్తున్న వారిపై నిఘా ఉంచేందుకు జిఐఎస్‌ ‌సర్వే సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ పనిని నియో జియో ఏజెన్సీకి రెండేళ్ళ పాటు భాద్యతలు జిహెచ్‌ఎం‌సీ అప్పగించింది. ఈ సర్వేలో ఏడాదిన్నరలో ఏకంగా 20 లక్షల భవనాలను సర్వే చేసేలా ఏజెన్సీకి టార్గెట్‌ ‌పెట్టనున్నట్లు సమాచారం. సర్వే వివరాలను ఏరోజుకు ఆరోజు సంబంధిత సర్కిల్‌ ‌డిప్యూటీ కమిషనర్‌కు అందించేలా ప్లాన్‌ ‌చేయనున్నారు. ఈ విషయంలో రిపోర్టు అందగానే సర్కిల్‌ ‌స్థాయి అధికారులు భవనం విస్తీర్ణం ఇదివరకు ఎంత ఉండేది, ఇప్పుడు ఏమైనా మార్పు ఉందా అన్న వివరాలను పరిశీలించి., విస్తీర్ణంలో మార్పు ఉంటే వెంటనే వారి అసెస్మెంట్‌ ‌లో విస్తీర్ణాన్ని మార్చి జీహెచ్‌ఎం‌సీ యాక్ట్ ‌ప్రకారం రెండున్నరేండ్ల ప్రపార్టీ ట్యాక్స్‌ను వెంటనే వసూలు చేయనున్నారు. ఇలాంటి సర్వే ఇప్పటికే మహారాష్ట్ర లోని బృహన్‌ ‌ముంబై కార్పొరేషన్‌ అమలు పరుస్తుంది. జీహెచ్‌ఎం‌సీ అధికారులు కొందరు అక్కడి పనితీరును ఇదివరకే పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *