ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ఆత్మ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి తమ కుటుంబాలకు భరోసా ఇవ్వలని తెలంగాణ ఆత్మ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షులు అదావత్ కృష్ణ నాయక్, ఆత్మ అసోసియేషన్ ట్రెజరీ జ్యోతి లక్ష్మిలు మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము గత 10 ఏళ్ళుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అత్మలో చాలి చాలని జీతాలతో పనిచేస్తున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. 10 ఏళ్ల నుండి రైతులకు సేవ చేస్తున్న తమకు కూడ రెగ్యులర్ చేసి జీవితాలలో వెలుగు నింపాలని కోరారు.




