ఆటో డ్రైవర్‌ ‌టమోటా ఆఫర్‌

న్యూ దిల్లీ, జూలై 19 : టమాటా  ధరలు మంటెత్తుతూ కిలో ఏకంగా రూ. 200 దాటి చుక్కలు చూపుతున్నాయి. టమాట లేకుండానే వంటలను సరిపెట్టేస్తున్న మగువలు ఈ నిత్యావసర కాయగూరను కిచెన్‌కు దూరంగా ఉంచుతున్నారు. టమాటా ధరలు రికార్డు ధరలకు చేరడంతో చండీఘఢ్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ అరుణ్‌ ‌వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చాడు. తన ఆటోలో ప్రయాణించే వారికి ఉచితంగా కిలో టమాటలు అందిస్తున్నాడు.

అయితే తన ఆటోలో కనీసం ఐదు సార్లు ప్రయాణించిన వారికే ఉచితంగా టమాటాలు ఇస్తున్నాడు. భారత సైన్యంలో పనిచేసే సైనికులకు అరుణ్‌ ‌గత 12 ఏండ్లుగా ఉచిత ఆటో ప్రయాణాన్ని కల్పిస్తున్నాడు. గర్భిణులను సైతం ఉచితంగా ఆస్పత్రులకు తీసుకువెళుతుంటాడు. ఆటో నడిపించడం ద్వారానే తాను బతుకుతున్నానని, కానీ ఇలాంటి సేవలు అందించినప్పుడు తాను ఎంతో సంతృప్తి చెందుతానని అరుణ్‌ ‌చెప్పుకొచ్చాడు.

పాకిస్తాన్‌తో అక్టోబర్‌లో జరిగే క్రికెట్‌ ‌మ్యాచ్‌లో భారత్‌ ‌గెలుపొందితే చండీఘఢ్‌లో ఐదు రోజులు ఉచిత ఆటో ప్రయాణం కల్పిస్తానని అరుణ్‌ ‌ప్రకటించాడు.కాగా తన షాపులో షూస్‌ ‌కొన్న వారికి రెండు కిలోల టమాటాలు ఉచితంగా అందిస్తానని ఇటీవల పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన ఓ షూ మార్ట్ ‌యజమాని ప్రకటించాడు. ఈ స్పెషల్‌ ‌సేల్‌ ఆఫర్‌ ‌కింద కస్టమర్లు రూ 1500 నుంచి రూ 2000 విలువైన షూస్‌ ‌కొనుగోలు చేస్తే వారికి రెండు కిలోల టమాటాలు ఉచితంగా ఇస్తామని తెలిపాడు. ఇదే తరహాలో తన షాపు నుంచి స్మార్ట్ ‌ఫోన్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దుకాణదారు ఉచితంగా టమాటాలు ఇస్తానని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *