ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం జీవన భృతి కల్పించి ఆదుకోవాలని బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కాప్రా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళకు ఉచిత ప్రయాణం ద్వారా ఆటో డ్రైవర్లు తమ కుటుంబ పోషణ కోసం ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ఆటో డ్రైవర్లు ఈ ఎం ఐ లు చెల్లించ లేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారన్నారని , వారికి పది వేల రూపాయలు జీవన భృతి కల్పించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, ఆటో యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ, నాగేష్ గోవింద్, శ్రీ రాము, ఆంజనేయులు,గోవర్ధన్, శేషయ్య,అనిల్,రమేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు



