ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల,డిసెంబర్ 20:  మొయినాబాద్ మండల కేంద్రంలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జాజాల రుద్రకుమార్ యాదవ్ హాజరై మాట్లాడుతూ ఆటో కార్మికులకు నెలకు 15వేల జీవన భృతి ఇవ్వాలని ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అర్హత కలిగిన వారిని ఆర్టీసీ డ్రైవర్లుగా హెల్పర్లుగా తీసుకోవాలని ఆటోల సేవలను ప్రభుత్వ సంస్థల్లో ఉపయోగించాలని ఇల్లు లేని ఆటో కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని ఓలా ఉబర్ రాపిడో అక్రమంగా నడుపుతున్న టూ వీలర్స్ లో నిషేధించాలని డిమాండ్ చేశారు.ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ సిఐటియు మొయినాబాద్ మండల కన్వీనర్ ప్రవీణ్ కుమార్, ఆటో యూనియన్ నాయకులు శేఖర్ఇ,మ్మానుయేల్, నరసింహ,మల్లేష్,కృష్ణ,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *