ఆటోనగర్ ఇస్కాన్ లారీల అడ్డాలను తొలగిస్తా దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 16; హయత్ నగర్ డివిజన్ పరిధిలోని హుడా సాయి నగర్ కాలనీ నందు హెచ్.ఏం.డి.ఏ.నిధులతో నిర్మించిన పార్కును ప్రారంభించిన ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి .ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని ఉన్న పార్కులు మరి ఎక్కడ లేవని గుర్తు చేశారు.అలాగే మన ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని రెండు స్విమ్మింగ్ పూల్స్ నిర్మించడం జరిగింది అని తెలిపారు.మరొకటి హస్తినపురం నందు త్వరలో మరో స్విమ్మింగ్ పూల్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క డివిజన్ నందు స్విమ్మింగ్ పూల్ నిర్మించడం తన లక్ష్యం అని తెలిపారు. ఆటోనగర్ ఇసుక లారీల అడ్డాలను తొలగించేందుకు అతి త్వరలో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సుధీర్ రెడ్డి p రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ నుండి నాగోలుకు , ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు మెట్రో లైన్ పొడిగించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృత నిశ్చయంతో ఉన్నట్టు స్పష్టం చేశారు
ఇట్టి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి,కొత్తపేట మాజీ కార్పొరేటర్ సాగర్ రెడ్డి,సీనియర్ నాయకులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్,లక్మారెడ్డి,కాలనీవాసులు అంజిరెడ్డి,జలందర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,మల్లారెడ్డి,యాదిరెడ్డి,జగన్ మెహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *