ఆటోనగర్ ఇసుక లారీ అడ్డ తొలగించాలి సమరంగ రెడ్డి

వనస్థలిపురం ప్రణతంత్ర సెప్టెంబర్ 2:హయత్ నగర్ డివిజన్, ఆటో నగర్లో ఇసుక లారీ అడ్డాను తొలగించాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ నవ జీవన్ రెడ్డితో కలిసి ధర్నానిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.2013 లో ఈస్ట్ కాలనీ వాసులు హ్యూమన్ రైట్స్ వారికి ఇసుక లారీ అడ్డా మూలాన తమకు అనేక రోగాలు , యాక్సిడెంట్లు బారిన పడుతున్నారని వినతి పత్రం అందజేయగా.. అధికారులు వెంటనే లారీ అడ్డాపై ఇన్స్పెక్షన్ చేసి వెంటనే తీసేయాలని ప్రొసీడింగ్స్ కూడా జారీచేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 2015 నవంబర్ లో కూడా ట్రాఫిక్ డీసీపీ , కలెక్టర్ మున్సిపల్ కమీషనర్ లారీ అడ్డా తొలగించాలని ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఎందుకు తరలించడం లేదన్నారు. లారీ అడ్డా తొలగించకుండా అధికారులను తన గుప్పెట్లోపెట్టుకొని స్థానికnసుధీర్ రెడ్డి తన స్వలాభం కోసం కమిషన్ కోసం ఇసుక లారీ అడ్డాను తొలగించకుండా కాలయాపన చేస్తున్నారు అన్నారు. లారీ ఓనర్స్ కి కేటాయించిన 11 ఎకరాల పార్కింగ్ స్థలంపై కన్నేశాడు అన్నారు. అందుకోసమే ఆటో నగర్లో అడ్డాను తొలగించడం లేదన్నారు. కాలనీ వాసులు , లారీ ఓనర్స్ సమస్య పరిష్కారానికి సహకరిస్తే కచ్చితంగా సమస్య సులువుగా పరిష్కరించవచ్చు అన్నారు. కానీ కొంత మంది తెరాస నాయకుల బెదిరింపులకు కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారన్నారు. వారందరికీ బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ఎవరు కూడా బయపడొద్దని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికలలో సుధీర్ రెడ్డి కి ప్రజలే కర్ర కాల్చి వాత పెడతానన్నారు. ఎవరొచ్చినా రాకున్నా బీజేపీ మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆటో నగర్ లో ధర్నా నిర్వహిస్తామని వంటావార్పు కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.పాల్గొన్నవారు ; కొత్త రవీందర్ గౌడ్ ,కళ్లెం రవీందర్ రెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డి , కొప్పుల నరసింహ రెడ్డి , పవన్ కుమార్ , వెంకటేశ్వర్ రెడ్డి , ఎల్లప్ప , విజ్జయి కుమార్ , కృష్ణవేణి, గోవిందా చారీ, చంద్రపాల్ రెడ్డి ,వై. సత్యనారాయణ , అప్పారావు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *