కాంతల క్రికెట్లో కాంతి పుంజం
మహిళా క్రికెట్‌కే మణిహారం
అతివల క్రికెట్‌ను అందలమెక్కించి..
ఆటలో మెరిసి, ఆటను మెరిపించె
మిరాకిల్ లేడీ మన మిథాలీ రాజ్ !
ఒడుదుడుకుల్ని ఓర్పుగా సహించి..
క్రికెట్ ఆటను అందలమెక్కించి..
ఎన్నో మైలురాళ్లు ధీటుగా దాటుతూ..
ఫార్మాట్ ఏదైన రికార్డుల మోతలతో..
అధిరోహించె అసమాన్య కీర్తి శిఖరాలు !
ఆమె మహిళా క్రికెట్‌కే పర్యాయపదం
అలుపెరుగని ఆట తీరు సమ్మోహనం
ఆమె మెరుపుల బ్యాటింగ్ రాజసం
విజయతీరాల్ని తాకిన నాయకత్వం
బ్యాట్ పడితే రికార్డుల విడ్డూరమే !
తన బ్యాట్‌కు ఉన్నాయి నేత్రాలు
బంతిని చూసి బౌండరీలు దాటిస్తూ..
మైదానాన అర్జున ఆవార్డీ మెరుపులు
క్రీజ్‌కు, బ్యాట్‌కు శాశ్విత వీడ్కోలంటూ..
ఇన్నింగ్స్ ముగించెను క్రికెట్ దిగ్గజం !
పద్మశ్రీ లేడి టెండూల్కర్ ఆటకు సలాం
సెంచరీల మోత మోగించిన ఖేల్‌రత్న
పరుగుల రాణి ఆటకు చెప్పెను టాటా..
మిథాలీ బ్యాట్‌కు అల్విదా అన్న వేళ
శభాష్ రాజ్ అంటోంది క్రికెట్ రాజ్యం !
– మధుపాళీ
కరీంనగర్ – 9949700037




