ఆచార్యదేవోభవ…!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : ఉపాధ్యాయుల దినోత్సవం(మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌జయంతి, సెప్టెంబర్‌ 5) ‌సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణను, జ్ఞానాన్ని పెంపొందించి, లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహనను కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదనీ సీఎం అన్నారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ’’ అనే సూక్తి  తల్లిదండ్రులు తర్వాత గురువుకున్న ప్రాధాన్యతను తెలియచేస్తున్నదని సీఎం అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు,ఉపాధ్యాయుల విద్యార్థుల సంక్షేమానికి, అభివృద్ధికి సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేస్తున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు.  గురుకుల విద్యలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, నాణ్యమైన విద్యను అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో ఉందని సిఎం తెలిపారు. గుణాత్మక విద్యను అందిస్తూ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చదువుల్లోనూ, క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో  రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నారని సిఎం అన్నారు. విద్యారంగ ప్రగతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి ఇది నిదర్శమని సీఎం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *