ఆచారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 17 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి గెలుపు కోసం ఆయన సతీమణి గీత ఆమనగల్ మున్సిపాలిటీ లోని 11వ వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. తన భర్త ఆచారి బిజెపి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని ఐదు సార్లు పోటీ చేసి ఆరోసారి మీ ముందుకు వచ్చారని ఆయనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మున్సిపాలిటీ తో పాటు మండలంలోని పలు గ్రామాలను అభివృద్ధి పరుస్తారని హామీ ఇచ్చారు. ఒక్క అవకాశం కోసం మీలో ఒకరిగా ఉంటూ పోరాటం చేస్తున్నారని మీ దీవెనలు అవసరమని అన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు బైకాని యాదమ్మ శ్రీశైలం యాదవ్, చెన్నకేశవులు, దివ్య శ్రీకాంత్ సింగ్, గజ్జె యాదమ్మ, యాదవ సంఘం అధ్యక్షుడు జెనిగల గిరి యాదవ్, బిజెపి నాయకులు గోజె ఆనంద్, పెద్దయ్య, బుచ్చయ్య, బిక్షపతి గౌడ్, జంగయ్య, రామస్వామి, శ్రీశైలం, తోట ఆనంద్, అశోక్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *