ఆచారికి మద్దతుగా బిజెపి నాయకుల ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 4 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి కి మద్దతుగా కడ్తాల్ మండలానికి చెందిన బిజెపి జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి సాయి లాల్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన నాయకులతో కలిసి కొండ్రిగాన్ బోర్డ్ తండా, పిల్లి గుండు తండా,  పెద్దిరెడ్డి చెరువు తండా,  నాగిరెడ్డి గూడ తండా, లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలను గడప గడపకు వెళ్లి ఓటర్లకు వివరించారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలు, రైతుల వద్దకు వెళ్లి ఒక్కసారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆచారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి సాయి లాల్ నాయక్,  జిల్లా గిరిజన మోర్చా అధికార ప్రతినిధి లక్ష్మణ్ నాయక్, రాష్ట్ర ప్రచార కమిటీ కో కన్వీనర్ రెడ్డి నాయక్, సీనియర్ నాయకుడు రాజు నాయక్, గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు మునేష్ నాయక్, యువ నాయకుడు నవీన్ నాయక్, రాజేష్ నాయక్, రాఘవేందర్ నాయక్, పాండు నాయక్, శంకర్ నాయక్, రమ్య నాయక్, వినోద్ నాయక్, రాజు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *