న్యూదిల్లీ,సెప్టెంబర్1 : దేశంలో గడిచిన 122 ఏళ్లలో ఈ ఏడాది ఆగస్టులో నమోదైనంత అతి తక్కువ వర్షపాతం మరే ఏడాది ఆగస్టులోనూ నమోదు కాలేదని భారత వాతావరణం కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా కేవలం 162.70 మిల్లీ టర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని తెలిపింది. ఐఎండీ డేటా ప్రకారం.. 1901 సంవత్సరం తర్వాత దేశంలో ఇంత తక్కువ వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి.
ఈ ఏడాది ఆగస్టులో నమోదైన 167.70 మిల్లీటర్ల వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే కూడా 36 శాతం తక్కువని ఐఎండీ తెలిపింది. 1901 నుంచి గడిచిన 122 ఏళ్లలో అత్యధికంగా 2021లో 194.30 మిల్లీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది. ఆ తర్వాత 1913లో (193.70), 2009లో (193.50), 1920లో (192.70), 1965లో (192.30), 2005లో (191.20) భారీ వర్షపాతాలు నమోదయ్యాయన్నారు. ఈ ఆగస్టులో దేశంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడానికి తక్కువ వర్షపాతం, బలహీనమైన రుతు పవనాలు ప్రధాన కారణాలని ఐఎండీ పేర్కొన్నది. ఈ మేరకు వివిధ సంవత్సరాల్లో ఆగస్టు నెలలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలకు సంబందించి ఐఎండీ ఒక గ్రాఫ్‌ను విడుదల చేసింది.




