ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుక

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు నాలుగు ‘డ్రీమ్-డిసైడ్-డిక్లరేషన్-డేట్‘లను అనుసరించాలని ముఖ్య అతిథి మేజర్ జయసుధ సూచించారు. ఈ మేరకు గురువారం ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ ఇన్వెస్టిచర్ వేడుకను నిర్వహించింది. క్రమశిక్షణ కనబరుస్తున్న యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయకత్వం ప్రాక్టికల్ డెమోక్రసీ ధర్మాలను నేర్పుతుందని ఆమె కొనియాడారు. ఎన్నుకోబడిన నాయకులను ఆమె అభినందించారు. బ్యాడ్జ్ ధరించడం చాలా పెద్ద బాధ్యత అని, స్థిరమైన లక్ష్యాలను సాధించడానికి వారు బుద్ధి పూర్వకంగా, న్యాయంగా ఉండాలని గుర్తు చేశారు. పాఠశాలలోని పచ్చదనం, విశాలమైన ఆట స్థలం విద్యార్థులు నేర్చుకునేందుకు, ఎదగడానికి బాగా సరిపోతుందని ఆమె తెలిపారు. వైస్ చైర్ పర్సన్ మేడం ప్రార్థన మణికొండ విద్యార్థులను అభినందించి విధులకు కట్టుబడి ఉండాలని సూచించారు. వివిధ సభలను ఏర్పాటు చేయడం, వాటిని క్యాబినెట్‌ల అధిపతులు నడిపించడం వల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, స్వీయ క్రమశిక్షణ పెంపొందుతాయని ఆమె ఉద్ఘాటించారు. కరస్పాండెంట్ కట్టా ప్రభాకర్ పిఇటి, ఇతర ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. ప్రధానోపాధ్యాయులు ఫహ్మిదా, రామాంజుల, ఫాతిమా కాజిమ్‌లు తమ విభాగాల్లో సాధించిన విజయాలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *