ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీలకే మద్దతు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహాసేన(ఎస్ఎస్ బిఎం) నేతలు స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో బలంగా ఉన్నామని మహాసేన ప్రభావం చూపిస్తామని ఎస్ఎస్ బిఎం జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో నిర్వహించే రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో అన్ని సామాజిక వర్గాల అభిప్రాయం సేకరించి ఏ పార్టీకి మద్దతు ఇస్తామనే విషయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ తాము మద్దతు ఇచ్చిన పార్టీలే అధికారంలోకి వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. గౌరవ అధ్యక్షులు వసుకుల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్టంలో చాప కింద నీరులా ఎస్ఎస్ బిఎం బలంగా ఉందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ సెల్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అంజలీ, బెల్లం మాధవి, గాయత్రి, మాదేని రఘు, విజయ్, గాదెపాక అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *