అశేష జనవాహిణి నడుమ ఖైరతాబాద్‌ ‌వినాయకుడి నిమజ్జన వేడుకలు

  • రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికిన బాలాపూర్‌ ‌లడ్డూ ధర
  • బండ్లగూడ జాగీర్‌ ‌విల్లాస్‌లో వేలంలో రూ. 1.26 కోట్లు పలికిన లడ్డూ ధర
అశేష .నవాహిని మధ్య ఖైరతాబాద్‌ శ్రీ ‌దశ మహా విద్యాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల ఎత్తు, 40 టన్నుల బరువున్న ఈ విగ్రహ నిమజ్జనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిమజ్జన పక్రియకు ఇసుకెస్తే రాలనంత జనం వొచ్చి.. బైబై వినాయకా అంటూ వీడ్కోలు పలికారు. మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్‌ ‌నుంచి టెలిఫోన్‌ ‌భవన్‌ ‌వి•దుగా డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయం ముందు నుంచి హుస్సేన్‌సాగర్‌ ‌వరకు సాగింది. ఇక్కడ చివరిసారిగా నిర్వాహకులు మహాగణపతికి పూజలు నిర్వహించారు. అనంతరం నాలుగో నంబర్‌ ‌క్రేన్‌ ‌ద్వారా మహాగణపతిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. కాగా ఉదయం ఖైరతాబాద్‌లో శోభాయాత్ర ప్రారంభం కాగా..మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగి…1:30 గంటల సమయంలో ఖైరతాబాద్‌ ‌గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్‌ ‌మళ్లించారు. ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికిన బాలాపూర్‌ ‌లడ్డూ ధర
రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్‌ ‌లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌చేస్తూ వేలం పాటలో రూ.27 లక్షలకు తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద్‌ ‌రెడ్డి గణనాథుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.2 లక్షల 40 వేలు అధికం కావడం విశేషం. 2022లో రూ.24.60 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి సొంతం చేసుకున్నారు. బాలాపూర్‌ ‌గణేశుడి ఊరేగింపు తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించారు. ఇందులో మొత్తం 36 మంది వేలంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. లడ్డూవేలం తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా, వేలంపాటలో లడ్డు గెలుపొందినవారు స్థానికులైతే మరుసటి ఏడాది, స్థానికేతరులైతే అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధన విధించారు.
1980లో బాలాపూర్‌ ‌గణేశ్‌ ఉత్సవ సమితి ఏర్పాటయింది. 1994లో లడ్డూ వేలం ప్రారంభం కాగా తొలి ఏడాది రూ.450కి లడ్డూ పాటలో దక్కించుకోగా.. 2017లో రూ.15 లక్షలు దాటింది. తొలిసారిగా 2020లో కొరోనా కారణంగా బాలాపూర్‌ ‌లడ్డూ వేలంపాట రద్దయింది. గ్రామాభివృద్ధి కోసం మొదలుపెట్టిన బాలాపూర్‌ ‌లడ్డూ వేలం పాట గణనాథుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. లడ్డూ దక్కించుకున్న వారి ఇంట్లో సిరిసంపదలతోపాటు వ్యాపార పరంగా బాగా కలిసి వొస్తుండటంతో ప్రతి ఏటా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంటున్నది. వేలంపాట ద్వారా వొచ్చిన డబ్బును ఉత్సవ కమిటీ.. గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నది. ఇప్పటి వరకు రూ.1,04,97,970 ఖర్చు చేసినట్లు ఉత్సవ కమిటి తెలిపింది.
బండ్లగూడ జాగీర్‌ ‌విల్లాస్‌లో వేలంలో రూ. 1.26 కోట్లు పలికిన లడ్డూ ధర
వినాయక ఉత్వల్లో భాగంగా బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్‌ ‌విల్లాస్‌లో వినాయకుని చేతిలోని లడ్డూకు జరిపిన వేలం పాటలో రికార్డు స్థాయిలో ధర పటికింది. ఏకంగా రూ. 1.26 కోట్లకు విల్లాస్‌లోని కమ్యూనిటీ మొత్తం కలిపి లడ్డూను సొంతం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *