టిజెఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.కోదండరాం
గన్ పార్క్ వద్ద ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమరుల ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపు
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్బంగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళ్లర్పిస్తున్న కోదండరాం
ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 02 : రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ పాలకులను గద్దె దించేందుకు తెలంగాణ జన సమితి(టిజెఎస్) పనిచేస్తుందని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.కోదండరాం వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడుతూ అమరుల ఆశయ సాధన కోసం, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ఘట్టాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మలి దశ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులతో పాత జ్ఞాపకాలను ఆయన పంచుకున్నారు. అంతకు ముందు నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం అమర వీరుల స్తూపం వద్ద నిర్వహించిన వేడుకలకు హాజరైయ్యారు.
ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎం నరసయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, నగర ప్రధాన కార్యదర్శి పట్టాల రామచందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అఫ్టల్, నగర నాయకులు జస్వంత్, జైపాల్ రెడ్డి సురేష్ లక్ష్మణ్, అశ్వగమద్ రాయప్ప చంద్రగిరి సత్యనారాయణ, రసూల్, రవికాంత్ మాణిక్యం పులిపాటి సుధాకర్, హనుమంత రెడ్డి, సలీం పాషా, అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.