అవసరమైన చర్యలు తీసుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే

హసన్‌పర్తి – కాజీపేట మధ్య ప్రమాదకర మార్కు వద్ద  నీరు ప్రవహించడంతో రైలు రెండు వైపులా రాకపోకలను నిలిపివేశారు.
సికింద్రాబాద్ డివిజన్‌లోని,  హసన్‌పర్తి – కాజీపేట సెక్షన్ మధ్య  ప్రమాదకర మార్కు వద్ద  నీరు  ప్రవహించడంతో ఈ రోజు ఉదయం రెండు వైపులా రైళ్ల రాకపోకలు నిలిపివేయబడ్డాయి ఈ సెక్షన్ సికింద్రాబాద్/హైదరాబాద్ నుండి ఢిల్లీకి బల్హర్షా మీదుగా ప్రయాణం సాగే కీలకమైన మార్గంలో ఉన్నందున కొన్ని సాధారణ రైలు రాకపోకలపై ప్రభావం పడింది.

పర్యవసానంగా, ఈ రోజు ఆనగా 27 జూలై 2023 సాయంత్రం 06:00 గంటల వరకు 5 రైళ్లు రద్దు చేయబడ్డాయి, 4 రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి, 2 రైళ్లు రీషెడ్యూల్ చేయబడ్డాయి మరియు 40 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించబడ్డాయి. ఈ రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులందరికీ తదనుగుణంగా వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి సందేశాలు పంపబడ్డాయి.

అదనంగా, అన్ని ప్రధాన స్టేషన్లలోతో పాటు  సాధారణ మార్గాల్లో మాత్రమే కాకుండా మళ్లించిన మార్గాల్లో కూడా సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.  వీటిలో సికింద్రాబాద్ , హైదరాబాద్, విజయవాడ, నిజామాబాద్ , వరంగల్, కాజీపేట, కరీంనగర్, ఖమ్మం , మంచిర్యాల్, సిర్పూర్ కాగజ్‌నగర్ రామగుండం, ఒంగోలు , సామర్లకోట , రాజమండ్రి స్టేషన్లలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటితోపాటు..
సికింద్రాబాద్ (040-27801111/27786666),
కాజీపేట (08702576430),
విజయవాడ (0866-2576924) మరియు గూడూర్ (7815909300)
మొదలైన ముఖ్యమైన స్టేషన్లలో కూడా హెల్ప్‌లైన్ నంబర్‌లు తెరవబడ్డాయి.

ప్రయాణికుల సమాచారం కోసం రైళ్ల రాకపోకల మార్పు గురించి అన్ని స్టేషన్లలో తరచుగా  పబ్లిక్ అనౌన్స్‌మెంట్‌లు చేయడం జరిగింది.  స్టేషన్లలో రైలు ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేయడానికి మరియు సహాయం చేయడానికి టిక్కెట్ తనిఖీ మరియు రైల్వే సిబ్బందిని నియమించారు. రైలు రద్దు చేయబడిన ప్రయాణికులకు ఛార్జీలు వాపసు  ఏర్పాటు చేయబడింది. బాధిత రైలు ప్రయాణీకులకు తగిన క్యాటరింగ్ ఏర్పాట్లను నిర్ధారించడానికి, ప్యాంట్రీ సౌకర్యం ఉన్న రైళ్లను గుర్తించడం జరిగింది మరియు తగిన స్టాక్ ఉండేలా చూస్తోంది.  ఇంకా, ఇతర రైళ్ల (మళ్లించబడిన) ప్రయాణీకుల ప్రయోజనం కోసం, మార్గంలో ఉన్న క్యాటరింగ్ యూనిట్లకు కూడా ప్రయాణీకుల ప్రయోజనం కోసం తగినంత స్టాక్ ఉంచడానికి తెలియజేయబడింది. రైళ్లు నియంత్రించబడే స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆహారం & త్రాగు నీరు కూడా అందించబడ్డాయి.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్  అరుణ్ కుమార్ జైన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రైళ్ల రాకపోకలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అన్ని భద్రతా చర్యలను సక్రమంగా చేపట్టాలని ఆయన అధికారులు మరియు సిబ్బందిని ఆదేశించారు. ప్రయాణీకులకు కనీస అసౌకర్యం కూడా  కలగకుండా చూడాలని మరియు సాధారణ రైలు కదలికలలో ఏవైనా మార్పుల గురించి ప్రయాణీకులకు సకాలంలో సమాచారం అందించాలని ఆయన నొక్కి చెప్పారు. వివిధ స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది అందరూ ¬అప్రమత్తంగా ఉండాలని, వర్షాల పురోగతిపై నిఘా ఉంచాలని , ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జనరల్ మేనేజర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *