అల్మాస్ గూడతో  పారిజాతతో కలిసి కేఎల్అర్ సతీమణి ఇంటింటి ప్రచారం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 24: కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచెన్నగారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతూ.. శుక్రవారం అయన సతీమణి విజయలక్ష్మి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, తదితరులతో కలిసి బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్ గూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం, అభివృద్ది సాధ్యమని, మహేశ్వరం అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎల్ఆర్ కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *