అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ధర్నా

ఘట్కేసర్ ప్రజాతంత్ర సెప్టెంబర్ 20:  మేడ్చల్ నియోజకవర్గం, ఘట్ కేసర్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలోని అర్హులైన నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ.. సిపిఎం సిపిఐ మండల కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ఘట్ కేసర్ తహశిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఘట్కేసర్ మండల పరిధిలో నూతనంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో స్థానికులైన మండల నిరుపేదలకు 50 శాతం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.  స్థానికులకు ఇవ్వకుండా జిల్లా కానీ వ్యక్తులకు ఇక్కడ ఇస్తున్నారని స్థానికులకు ఇవ్వకపోతే ఐక్యంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నేతలు ఎన్ సబిత, జయచంద్ర, లొట్టి ఈశ్వర్, కడమంచి యాదగిరి, కే సోమయ్య, కె అలివేలు, బిఆర్ సునీత, అనిత, సరోజన, దుర్గాప్రసాద్, మంజుల, సుజాత, ఎండి ఫర్వాణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *