- కరపత్రం
- అభ్యుదయ మహిళా సంఘం (పీవోడబ్ల్యూ)
- ముగింపు సభ:: జూన్ 22, 2024, సమయం: ఉ. 11 గం. నుండి సా. 5 గం. వరకు,
- వేదిక : ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్, హైదరాబాద్.
1974లో ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్ధినుల చొరవతో అభ్యుదయ మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఏర్పడిరది. ప్రణాళిక స్ఫూర్తితో ఏర్పడిన నాలుగు ప్రగతిశీల మహిళా సంఘం సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాలలో మహిళా సమస్యలపై పోరాటాలు చేస్తున్నాయి. ఈ సంస్థలన్నీ గత నాలుగు దశాబ్దాలుగా స్త్రీలపై బహుముఖ రూపాలలో కొనసాగుతున్న జండర్ వివక్ష, హక్కుల అణచివేత, హింసలకు, పితృస్వామిక ఆధిపత్య సంస్కృతికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ నయా ఉదారవాద ఆర్ధిక విధానాలను ప్రశ్నిస్తూ ఉద్యమాలని నిర్మిస్తున్నాయి. అవిభాజ్య తెలుగు రాష్ట్రంలో జరిగిన చారిత్రక సారా, మద్యం వ్యతిరేక ఉద్యమంలో పీవోడబ్ల్యూ సంస్థల నాయకత్వంలో వేల సంఖ్యలో మహిళలు కదిలి పోరాడారు. దళిత మహిళల భూపోరాటాలను, సాయుధముఠా నాయకుల హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక ఉద్యమాలను నిర్మించాయి.
విద్యా, ఉద్యోగ, చట్ట సభలలో 50% రిజర్వేషన్ల కోసం, పట్టణ ప్రాంతాలలో పేద ప్రజల నివాస హక్కులకోసం పోరాటాలు చేశాయి. మతోన్మాదానికి వ్యతిరేకంగా మహిళలను సంఘటిత పరుస్తున్నాయి. అత్యాచార, కుటుంబ హింస, లైంగిక వేధింపుల నిరోధక చట్టాల రూపకల్పనలో భాగస్వామ్యం వహించాయి. పోరాడి సాధించుకున్న చట్టాల అమలుకై నిరంతరం పని చేస్తున్నాయి. అటవీ ప్రాంతాల నుండి ఆదివాసీలను తరిమివేసి గనుల తవ్వకానికి, సహజ సంపదల దోపిడీకి, కార్పొరేట్లకు కట్టబట్టే చర్యలకు పాలకులు వేగిరం చేస్తున్నారు. అందులో భాగంగా అటవీ సంరక్షణ చట్టానికి సవరణల పేరుతో ముందుకు వస్తూ ఆదివాసీలపై యుద్ధం ప్రకటిస్తున్నాయి. వేలాది మంది అమాయికుల ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ క్రమంలో జరగుతున్న మానవ హక్కుల హననం పట్ల మహిళా సంస్థలుగా నిరంతరం గొంతెత్తి మాట్లాడుతున్నాయి.
2014 సంవత్సరం కేంద్రంలో అధికారం చేపట్టిన బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలను, సెక్యులర్ విలువలను కాలరాస్తూ హిందుత్వ ఎజెండాతో నియంతృత్వంగా పరిపాలిస్తున్నది. జాతీయత, దేశభక్తి ముసుగులో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కార్పోరేట్ శక్తులకు దేశ ఆర్ధిక వనరులను కట్టబెడుతూ మహిళల, దళితుల, ఆదివాసుల, ముస్లిం మైనారిటీల హక్కులపై దాడి చేస్తున్నది. భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా అడ్డుకుంటూ ప్రాధమిక హక్కులను కూడా నిరాకరిస్తోంది.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిని తీవ్ర నిర్భంధానికి గురిచేస్తోంది. తన వాట్సప్ పెయిడ్ ఆర్టిస్టులతో మహిళా ఉద్యమకారులను, జర్నలిస్టులను, ప్రజాస్వామిక వాదులను అసభ్య పదజాలంతో వేధిస్తూ వెంటబడుతూ వారి గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నది. ఊపా లాంటి ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రయోగిస్తున్నది. విద్యా రంగాన్ని కాషాయీకరణ చేస్తోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కామన్ సివిల్ కోడ్ బిల్లును తెర పైకి తెచ్చింది. మైనారిటీ మతస్థులపై, ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన తెగలపై దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులను రెచ్చగొట్టి సమాజంలో భావోద్రేకాలను సృష్టించి, ఘర్షణలు రేపెట్టి తద్వారా ఓట్లు దండుకోవాలని మోదీ అమిత్ షా పథకం. బాలికలపై మహిళలపై అత్యాచారాలకు హత్యలకు, వేధింపులకు పాల్పడుతున్న నేరస్తులను కేంద్ర ప్రభుత్వం రక్షిస్తోంది. కథువా, హత్రాస్, బిల్కిస్ బాను సంఘటనలలో, మహిళా మల్లయోధుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరే ఇందుకు సజీవ సాక్ష్యం. తీస్తా సెతల్వాద్, మరి కొందరి విషయంలో కోర్టులు సైతం మనువాద భావజాలంతో నేరస్తుల పక్షం వహిస్తూ తీర్పులు ప్రకటిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి అధికారం నిలబెట్టుకోడానికి మోది దయా దాక్షిణ్యాల కోసం అంగలారుస్తూ ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి పాలయ్యాయి. అన్ని పాలక వర్గ పార్టీలు మహిళల అభివృద్ధిని ఎన్నికల ప్రచారానికి, బూటకపు వాగ్ధానాలకు పరిమితం చేశాయి.
ఉపా కింద ప్రముఖ రచయిత అరుంధతి రాయ్ ను ప్రాసిక్యూట్ చేయడానికి ఢల్లీి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనుమతి ఇవ్వడం, 14 సంవత్సరాల క్రితం నాటి కేసులో ఢల్లీి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇలా అనుమతి మంజూరు చేయడం దురుద్దేశంతో కూడిన చర్యగా భావిస్తున్నాం. ఐపీసీ లోని 124 బి, 153ఏ, 153బి, 504, 505,13, ఉపా వంటి తీవ్రమైన సెక్షన్ కింద ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతినివ్వడం ప్రజల, ప్రజాస్వామ్య హక్కుల కోసం గొంతెత్తే వారిని అణిచివేయాలని బిజెపి ప్రభుత్వం భావిస్తుంది అని స్పష్టమవుతుంది. ప్రాసిక్యూషన్‌కు అనుమతిని తక్షణమే ఉపసంహరించుకోవాలని పీవోడబ్ల్యూ అర్ధ శతాబ్ది వార్షికోత్సవ సమన్వయ కమిటీ డిమాండ్ చేస్తున్నది. అలాగే ప్రముఖ విద్యావేత్త షేక్ షౌకత్ హుస్సేన్ ను 14 ఏళ్ల నాటి కేసులో ఉపా చట్టం కింద ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వడాన్ని కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా తీసుకున్న ప్రతికార చర్యగా ప్రజలు గుర్తించాలని కోరుతున్నది. ఈ చర్యకు వ్యతిరేకంగా ప్రజలు ప్రజాస్వామిక వాదులందరూ పెద్ద ఎత్తున కదిలి ఉద్యమించాలని విజ్ఞప్తి చేస్తున్నది. పాలకుల రైతాంగ, ఆదివాసీ వ్యతిరేక విధానాలపై జరుగుతున్న అవిశ్రాంత పోరాటాలకి మద్దతుగా మా సంస్థలు నిలిచాయి. దేశంలో బిజేపి పాలకులు సాగిస్తున్న ఫాసిస్టు నిర్భంధాన్ని ప్రతిఘటిస్తూ సాగుతున్న ఉద్యమాలలో, పౌర హక్కులను అణిచివేసే కొత్త నేర చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలలో భాగస్వామ్యం కలిగి వుంటాయి.
ఈ నేపధ్యంలో, జూన్ 22, 2023న షోయబ్ హాల్ లో మహిళా మేధావులు, పీవోడబ్ల్యూ సంస్థల అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో భావసారూప్యత కలిగిన మహిళా సంస్థలన్నీ ఒక తాటి మీదకు రావాలనే అభిప్రాయం బలంగా వ్యక్తం అయ్యింది. ఆ స్ఫూర్తితో 2024 జూన్ 22 న జరగబోయే పీవోడబ్ల్యూ అర్ధ శతాబ్ది వార్షికోత్సవ సభను అన్ని సంఘాలు కలిసి ఒకే వేదిక నుంచి ఉమ్మడిగా నిర్వహించాలని నిర్ణయించుకుని, అందుకు ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నాయి. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 19, 2023న, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లిలో ఒక రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు.
ఈ క్రమంలో, నాలుగు పీవోడబ్ల్యూ సంస్థల భాగస్వామ్యంతో 2024 జూన్ 22న ఫ్రెస్ క్లబ్, బషీర్ బాగ్, హైదరాబాద్‌లో ఉ? 11 గం? నుండి సా? 5 గం? వరకు ముగింపు సభ జరుగుతుంది. సభకు ముందు లిబర్టీ అంబేడ్కర్ విగ్రహం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు మహిళా కళాకారులు, కార్యకర్తలతో ప్రదర్శన జరుగుతుంది. అనంతరం ప్రెస్ క్లబ్లో జరిగే ముగింపు సభలో ప్రముఖ స్వతంత్ర జర్నలిస్ట్, రచయిత్రి భాషా సింగ్ ముఖ్యఅతిధిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రొ? రమ మేల్కొటే, ప్రొ? శ్యామల, ప్రొ? లక్ష్మీ, కాత్యాయిని(చూపు) తదితర… మహిళా మేధావులు పాల్గొని ప్రసంగిస్తారు.
పీవోడబ్ల్యూ అర్ధ శతాబ్ది సమన్వయ కమిటి అంబిక, జి. రaాన్సీ, వి. సంధ్య, చండ్ర అరుణ, సుజ్ఞానమ్మ ఇంకా పిఓడబ్ల్యు సంస్థల ప్రతినిధులు వక్తలుగా పాల్గొంటారు.
ఈ సందర్భంగా, మా సంస్థలు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఆర్థిక సహాయ, సహకారాలు అందించాలని, మిత్రులను, శ్రేయోభిలాషులను ఉద్యమాభిమానులను కోరుతున్నాం…
పీవోడబ్ల్యూ:
ఆకాశంలో సగం మనం! అనంతకోటి నక్షత్రాల్లో సగం మనం !!
పోరాటంలో సగం మనం !!!
——————————
పీవోడబ్ల్యూ అర్ధ శతాబ్ది వార్షికోత్సవ సమన్వయ కమిటీ తరఫున
కె. సంధ్య, అంబిక (కరపత్ర ప్రచురణకర్తలు)





