అర్జున విజేతలకు సిఎం కెసిఆర్‌ అభినందనలు

తెలంగాణకు గర్వకారణమని ప్రశంసలు
టేబుల్‌ ‌టెన్నిస్‌లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ బిడ్డ ఆకుల శ్రీజకు, నిఖత్‌ ‌జరీన్‌లకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్‌ ‌సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో క్రీడారంగంలో శ్రీజ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఆకుల శ్రీజతో పాటుగా నిఖత్‌ ‌జరీన్‌కు కూడా అర్జున పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. టీటీ లెజెండ్‌ ఆచంట శరత్‌ ‌కమల్‌ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు సెంట్రల్‌ ‌స్పోర్టస్ ‌మినిస్టీ 2022కి గాను స్పోర్టస్ అవార్డు విన్నర్ల లిస్ట్‌ను సోమవారం ప్రకటించింది. మొత్తం 25 మంది అథ్లెట్లు అర్జునకు ఎంపికయ్యారు.

ఈ నెల 30న రాష్ట్రపతి భవన్‌లో జరిగే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల వి•దుగా అవార్డుల్ని అందజేయనున్నారు. ఇక క్రీడారంగంలో అత్యంత ప్రతిభను కనబరిచే క్రీడాకారులకు ప్రతి ఏటా ఇచ్చే అర్జున అవార్డుల్లో ఈసారి నిఖత్‌ ‌జరీన్‌కు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్‌, ‌గ్రావి•ణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు హర్షం వ్యక్తం చేశారు. అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన నిఖత్‌కు అర్జున అవార్డు రావడం తెలంగాణకే గాక, దేశానికే గర్వకారణమని మంత్రి అన్నారు. ప్రపంచ స్థాయిలో మరింతగా రాణించి, దేశ కీర్తిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *