హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : అరబిక్ భాషపై అవగాహన కల్పించేందుకు ఆసక్తి ఉన్న పాఠశాలలకు రహబర్ సొసైటీ అరబిక్ ఉపాధ్యాయులను అందజేస్తుందని రహబర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ వికరుద్దీన్ అన్నారు. విద్యార్థులకు ఈ సదుపాయం ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల విద్యార్థుల వరకు ఉంటుందని అన్నారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సయ్యద్ వికరుద్దీన్ మాట్లాడుతూ 2010లో యునెస్కో యుఎన్ అరబిక్ భాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించిందని, ప్రపంచ అరబిక్ భాషా దినోత్సవాన్ని 2012 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్లో 18 న జరుపుకుంటున్నామని తెలిపారు. పాఠశాలలో అరబిక్ భాషను ప్రోత్సహించడానికి, నేషనల్ అరబిక్ కింద రహబర్ సొసైటీ విద్యార్థుల కోసం ప్రత్యేక చొరవను కొనసాగిస్తోందనని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి యొక్క ఆరు అధికారిక భాషలలో అరబిక్ ఒకటి అని పేర్కొన్నారు. నేషనల్ అరబిక్ లెర్నింగ్ కింద పాఠశాల విద్యార్థులకు ఉచిత అరబిక్ భాష నేర్చుకునే అవకాశం ప్రోగ్రామ్ ఫర్ స్కూల్(ఎన్పీఎస్) ఈ సౌకర్యాన్ని అందించడానికి ఆసక్తి ఉన్న పాఠశాలలు, విద్యార్థులు చదువుతున్న పాఠశాల విద్యార్థుల సంఖ్య, పాఠశాల స్థితిగతులతో మమ్మల్ని సంప్రదించవచ్చని అన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నామని వివరించారు.




