వచ్చావ్ తెచ్చావ్
వెలుగుల్ జిలుగుల్
దగ్గరికొచ్చావ్
దర్శనమిచ్చావ్
చూపించేసావ్
విశ్వస్వరూపం
చీకట్లల్లో
చిందులు తొక్కుతూ
బొందలు పెడుతూ
నిజాల జాడలు
అడుగులు మడుగులు
ఆక్రోశానికి
కథలూ వ్యథలూ
బంధుత్వానికి
కలిపీ నలిపీ
చెరిపి పరిచీ పరారై
దుప్పటి కప్పుతు
కట్టలు కడుతూ
ఆపుతు ఊపుతు
వ్యర్థ ప్రయత్నం
ఇది ఆగని ఆరని
అరణ్యగర్భం
ఆహం భావం
ఆటలు కాదు అర్థం
మాటల తూటలు
ఇట్టే కష్టం
దొరికావ్ నిలిచావ్
సిగ్గుతో నిగ్గుతో
మెలిగావ్ అరిచావ్
కాకిలా నక్కలా
చస్తావ్ పోతావ్
కృషించి నశించి
చచ్చేవరకూ
బ్రతకూ నిలువూ
జర పైలంగా…
– రఘు వగ్గు




