అయ్యప్ప శరణు ఘోషలతో మారుమోగిన హరిహరపుత్ర పడిపూజ

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 13 : అయ్యప్ప నామస్మరణ,శరణు ఘోషలతో కొత్తగూడ చౌరస్తా వద్ద హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడిపూజ అభిషేకం మారు మోగింది.కొత్తగూడ చౌరస్తాలోని కొత్తగూడ గ్రామ సన్నిధానానికి చెందిన బుక్క సురేందర్ రెడ్డి గురుస్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కందుకూరు మండలంలోని పలు గ్రామాల అయ్యప్ప గురు స్వాములు మాల ధరించిన అయ్యప్ప స్వాములు భక్తులు ఈ పూజ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.అయ్యప్ప శరణు ఘోషలతో పాటు భజన కార్యక్రమంలో గానం చేసిన పలువురు అయ్యప్ప సంకీర్తనలతో ప్రాంగణాన్ని పులకరింపజేశారు.పూజ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు పూజ మొదలు పూజా చివరి దశ వరకు అయ్యప్ప నామాలను పలకరించుకుంటూ పూజా కార్యక్రమంలో నిమగ్నులయ్యారు.ముందుగా గణపతి పూజతో ప్రారంభమైన పడిపూజ కార్యక్రమం అయ్యప్ప స్వామి వారికి పంచామృతాభిషేకంతో పాటు కుంకుమ, గంధము,పూలు,పండ్లు,నెయ్యి,పాలు, పెరుగు,తేనె,బస్మాలతో కూడిన వంటి పలు రకాల పదార్థాలతో అయ్యప్ప స్వామి వారికి అభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమం కొత్తగూడ సన్నిధానం గురు స్వామి సాద మల్లారెడ్డి సౌడపు శేఖర్ గౌడ్,కందుకూరు మండల కేంద్ర గురుస్వామి రామకృష్ణ చారి, రాముపంతులు గురుస్వామి,గూడూరు పండల శ్రీనివాస్ గౌడ్,కొత్తూరు కుమార్,తదితర గ్రామాల గురుస్వాముల ఆధ్వర్యంలో ఈకార్యక్రమం నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమానికి బిజెపి పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి,ఆయా పార్టీల నాయకులు,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సామ ప్రకాష్ రెడ్డి,బిఆర్ఎస్ నాయకులు జిట్ట రాజేందర్ రెడ్డి,సామ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొని స్వామివారి దీవెనలు తీసుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. విచ్చేసిన అయ్యప్ప స్వాములకు,భక్తులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించి భక్తులకు వడ్డింప చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *