అయ్యప్ప  మహా పడిపూజలో పాల్గొన్న  శేరిలింగంపల్లి ఎమ్మెల్యేఆరెకపూడిగాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 8: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి లో గల రంగనాథ్  దేవాలయం నందు  ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడిపూజా మహోత్సవంలో శుక్రవారం శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ , గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి   ముఖ్య అతిథిలుగా పాల్గొని  అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం  వారిని ఘనంగా సన్మానించారు. ప్రత్యేకంగా  ఏర్పాటు చేసిన మండపం లో   విఘ్నేశ్వర,  సుబ్రమణ్యస్వామి,  అయ్యప్ప చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్పల భజన పాటలతో అక్కడి ప్రాంగణం స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. అనంతరం స్వామికి వివిధ రకాల పూలతో పుష్పార్చన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్పొరేటర్లు  మాట్లాడుతూ అయ్యప్ప మహా పడి పూజ ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని పెంపొందిస్తుందన్నారు. స్వామి వారి పడిపూజా మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామి వారి కృప తప్పక ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గురుస్వామి సాయి ,శ్రీనివాస్, మధు, కృష్ణ, నగేష్, సుమన్,అన్నదాతలు నర్సింగ్ రావు, పోచయ్య, సీనియర్ నాయకులు, ప్రకాష్,మన్నే రమేష్, రంగస్వామి,చిన్న, గోవర్ధన్ ,గోపనపల్లి గ్రామం వాసులు, స్థానిక భక్తులు, మహిళలు, పిల్లలు ,మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *