అమీన్ పూర్ లో ఘనంగా కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 13: పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి కాటా శ్రీనివాస్ గౌడ్  45 వ జన్మదిన వేడుకలను అమీన్ పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేవిధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు మన్నె రవీందర్, ప్రధాన కార్యదర్శులు రమేష్ యాదవ్, కుమ్మరి మహేష్, నాయకులు కోకల శ్రీనివాస్, చంద్రశేఖర్, సుధాకర్ యాదవ్, ఈశ్వర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రకాష్, శంకర్, సతీష్ ముదిరాజ్ మరియు కార్యకర్తలు, కెఎస్ జీ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *