అమీన్ పూర్ లో అంబరాన్నంటిన కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: ఎల్బీ స్టేడియంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆదేశానుసారం, అమీన్ పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బాణ సంచాలు కాల్చి, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. తదనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ ర్యాలీతో హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గం లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటమి చెందినప్పటికీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడానికి బీఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలను వెలికి తీసి, నీతివంతమైన ప్రజాపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపల్ కౌన్సిలర్ మున్న, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మన్నె రవీందర్, ప్రధాన కార్యదర్శులు రమేష్ యాదవ్, కుమ్మరి మహేష్, నాయకులు సుధాకర్ యాదవ్, ఈశ్వర్ రెడ్డి, సత్యనారాయణ, చుక్కారెడ్డి, సురేష్ నాయక్, కృష్ణ, రాములు గౌడ్, పెద్ద మల్లేష్, అప్పారావు,  భిక్షపతి, లక్ష్మణ్,బిల్లీ శ్రీనివాస్ యాదవ్, జయవర్ధన్, ఎల్వర్తి మల్లేష్ యాదవ్, శరత్ చారి, రాము, గౌస్ బాబా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *