అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్

– భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల కూల్చివేత

సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపురం గ్రామంలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చివేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఈ భారీ ఆపరేషన్‌ను నిర్వహించింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మించిన ఓ గెస్ట్ హౌస్‌తోపాటు, ఆరు అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. ఐలాపురం తండాతోపాటు గ్రామంలోని పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా ఖాలీ స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుటోంది. అమీన్‌పూర్ మండలం మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఖాళీ భూమి విలువ రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని 1998 నుంచి కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోకుండా నిర్మించిన ముఖిమ్ అనే వ్యక్తి నిర్మించిన గెస్ట్ హౌస్‌ను, ఎలాంటి అనుమతులు లేకుండా అతని సోదరుడు అజీమ్ నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని హైడ్రా తొలగించింది. కేవలం అక్రమంగా నిర్మించిన భారీ కట్టడాలు, ఖాలీ స్థలాల స్వాధీనంపైనే దృష్టి సారించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. కూల్చివేతల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *