అమర్‌నాథ్‌ ‌యాత్రలో విషాదం

రాజమండ్రికి చెందిన మహిళ మృతి
అమరావతి, జూలై 11 : రాజమండ్రికి చెందిన మహిళ అమర్‌నాథ్‌యాత్రలో మృతి చెందింది. ఆంధప్రదేశ్‌ ‌నుంచి వెళ్లిన వారిలో ఐదుగురు భక్తుల జాడ తెలియడం లేదని ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా ఉండగా,గుడిమెట్ల సుధ ,పార్వతి జాడ తెలియాల్సి ఉండగా గుడిమెట్ల సుధ మృతదేహాన్ని భర్త విజయ్‌ ‌కిరణ్‌ ‌గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పార్వతి జాడ తెలియాల్సి ఉంది. అమర్‌నాథ్‌లోని మంచు లింగాన్ని దర్శించుకోవడానికి నెల్లూరు, ఏలూరు, తణుకు, రాజమహేంద్రవరానికి చెందిన సుమారు 34 మంది అమర్‌నాథ్‌కు చేరుకున్నారు.

దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కలిసి వీరు నివసించే సమిపంలో ఆకస్మికంగా వరద రావడంతో వరదలో చిక్కుకుని కొందరు చనిపోగా మరికొందరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టగా లభిస్తున్న మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరికొందరి ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ ‌వస్తున్నాయని వారి ఆచూకి దొరకడం లేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *