అమర్‌నాథ్‌లో క్షేమంగా జనగామ వాసులు

బంధువులకు సమాచారం
హైదరాబాద్‌, ‌జూలై 9 : జమ్మూకశ్మీర్‌లోని అమర్‌నాథ్‌లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షాలకు వరద పోటెత్తింది. తెలంగాణకు చెందిన పలువురు భక్తులు సైతం అమర్‌నాథ్‌ ‌యాత్రలో చిక్కుకు పోయారు. జనగామ జిల్లాకు చెందిన తాడూరి రమేశ్‌, ‌జిల్లా సత్యనారాయణ, పల్లెల లక్ష్మీనరసయ్య, సిద్ధి లక్ష్మి దంపతులు చిక్కుకుపోయారు. నలుగురు ఈ నెల 3న ఢిల్లీకి బయలుదేరారు.

అక్కడి నుంచి మరో ట్రైన్‌లో జమ్మూ వరకు వెళ్లారు. ఆ తర్వాత వాహనంలో పహిల్గామ్‌ ‌వెళ్లి.. అక్కడి నుంచి కాలినడకన అమర్‌నాథ్‌ ‌వద్దకు చేరుకున్నారు. కిలోవి•టర్‌ ‌దూరంలో ఉన్న సమయంలో వరద నీరు పోటెత్తడంతో ఆర్మీ యాత్రను నిలిపివేస్తున్నట్లు ఆర్మీ జవాన్లు తెలిపారంటూ బంధువులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రాత్రంతా చిమ్మచీకట్లో భయం భయంగా గడిపినట్లు శనివారం ఫోన్‌ ‌ద్వారా బంధువులకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *