అమనగల్లులో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 :  టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మండ్లి రాములు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కార్యాలయం వద్ద రాములు ఆధ్వర్యంలో కేకును కట్ చేసి బాణాసంచా కాల్చారు. రేవంత్ కు అనుకూలంగా నినాదాలు చేశారు, ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ నిరంతరం ప్రజా శ్రేయస్సు, వారి వెన్నంటి ఉంటూ, ప్రభుత్వ వైఫల్యలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి రేవంత్ రెడ్డి అని తమ అభిమానాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మనయ్య, మాజీ సర్పంచ్ శ్రీరాములు, ఉపసర్పంచ్ మల్లేష్, నాయకులు యాదయ్య, మల్లయ్య, మైసయ్య, విజయ్ రాథోడ్, పర్వతాలు, కిషన్, రవీందర్, పత్య, లక్ష్మణ్, మల్లేష్,  రాంజ్య,  శ్రీధర్, కు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *