ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు. ఎక్కడ స్త్రీలను, గౌరవించరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైన ఫలించదు. భారత సంస్కృతిలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మహిళలు జనాభా లో సగమైన సాధికారత పొందకుండా నవభారత స్వప్నం సాకారం కావడం అసంపూర్ణమే అవుతుంది. ఈనాడు మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, రాజకీయం. వ్యాపారం, క్రీడలు తదితర రంగాలన్నింటిలోనూ విస్తరిస్తుంది ఈ వాస్తవాలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల సమగ్ర వికాసానికి అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నది. అందులో భాగంగానే మహిళలను సంఘటిత శక్తిగా తయారుచేయడమే లక్ష్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలోని మహిళ లో దాగిఉన్న శక్తిని సమాజానికి ఉపయోగపడటానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. మహిళలను పొదుపు వైపు మళ్ళించడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆర్ధికంగా బలోపేతం చేయడం, అదే సమయంలో ఆర్థిక క్రమ శిక్షణ వైపు మళ్లించడం సంఘాల ఏర్పాటులో ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో 4,36,512 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో 46,66,523 మంది సభ్యులు ఉన్నారు. స్వయం సహాయక సంఘాలు ప్రారంభించిన ఆరు నెలల అనంతరం వారి ఉపాధికి అవసరమైన రుణాలను బ్యాంకు ద్వారా ఇప్పిస్తున్నారు. గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో అనేకమంది స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో 3,60,311 స్వయం సహాయక సంఘాలు ఉండగా, తెలంగాణ ఏర్పడిన అనంతరం గత ఎనిమిదేళ్ల లలో 76,321 స్వయం సహాయక సంఘాలను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని, గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుతం 4,36,512 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాల వల్ల అనేక మంది మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయి. కార్యక్రమం పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్రంలో 32 జిల్లా సమాఖ్య లను ఏర్పాటు చేయబడ్డాయి. రాష్ట్రంలో 553 మండల సమాఖ్యాలు, 17,954 గ్రామ సమాఖ్య పనిచేస్తున్నాయి.
రాష్ట్రంలో సెర్ప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల లోని స్వయం సహాయక సంఘాలకు గత 8 ఏండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో (2014-15 నుండి 2021-22 వరకు) 56,004 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ కల్పించబడిందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది , గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి గణనీయంగా పెరిగిందని, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,96,447 స్వయం సహాయక సంఘాలకు 3739 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించగా, 2021-22 సంవత్సరం లో 2 లక్షల 56 వేల 779 మహిళా స్వయం సహాయక సంఘాలకు 12,200 కోట్ల 59 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించబడిందని ఆయన తెలిపారు.
2022-23 ఆర్ధిక సంవత్సరంలో సెర్ప్ ద్వారా 3,70,825 మహిళా స్వయం సహాయక సంఘాలకు 15001 కోట్ల 15 లక్షల రూపాయల బ్యాంకు లింకిజీ కల్పించాలని లక్ష్యం గా నిర్ణయించబడగా, జూన్, 29 వ తేదీ వరకు 31,303 మహిళా స్వయం సహాయక సంఘాలకు 1600 కోట్ల 41 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించబడిందని, మిగతా లక్ష్యాన్ని 2023 మార్చి నెలాఖరులోగా సాధించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయబడుతున్నదని మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు తెలిపారు .
తెలంగాణ రాష్ట్రంలో 2014-15 ఆర్ధిక సంవత్సరం నుండి 2022-23 ఆర్ధిక సంవత్సరం లో 2022 జూన్ 29 వరకు సెర్ప్ ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు కల్పించబడిన ట్యాంకు లింకేజీ వివరాలు ప్రకటనలో పొందుపరచారు.రాష్ట్రంలో నున్న స్వయం సహాయక సంఘాల లో 46,66,523 మంది సభ్యులలో 10,10,619 మంది షెడ్యూల్డ్ కులాలకు, 6,44,185 మంది షెడ్యూలు తెగల కుటుంబాలకు, 1,51,777 మంది మైనారిటీ కులాలకు, 25,35,595 మంది వెనుకబడిన తరగతుల కుటుంబాలకు, 3,24,347 మంది ఇతర కులాలకు చెందిన మహిళలు సభ్యులుగా ఉన్నారు.
సెర్ప్ ఫ్లిప్ కార్ట్ ఒప్పదం:
రాష్ట్రంలో గ్రామీణ మహిళా సంఘాల ఉత్పత్తులను దేశ, విదేశాలలో విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఈ కామర్స్ సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకొంది. 140 రకాల ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆన్ లైన్లో విక్రయచేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఈ విధమైన ఎం.ఓ.యూ దేశంలోనే తొలిసారి. ఈ ఏడాది 500 కోట్లు రూపాయల వ్యాపారం లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణా మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ ఒప్పందంలో స్థానికంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరుగుతయన్నారు. మహిళా సంఘాల 30 ఏళ్ల ప్రయాణానికి ఈ ఒప్పందం మంచి మార్గమని, దీని వల్ల మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు ఏర్పడుతాయని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి ఈ సంఘాల ద్వారా మహిళలలో పొదుపు చేయాలనే చైతన్యం గణనీయంగా పెరిగింది. వీరందరూ పొదుపు చేసుకుంటూ బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు పొందుతున్నారు. క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. 2021-22 వ సంవత్సరంలో రుణాల రికవరీ రేటు 98 శాతంగా ఉంది.
గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో అనేక మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి.
మహిళలు వారికున్న నైపుణ్యంతో అనేక వస్తువులను తయారు చేస్తున్నారు వారు తయారు చేసిన వస్తువులను విక్రయించడానికి ద్వారా మేలాలు . నిర్వహించబడుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసి విక్రయ స్టాల్స్ తెలంగాణకు సంబంధించిన అనేక మంది మహిళలు పాల్గొని వారు తయారు చేసిన వస్తువులను విక్రయిస్తున్నారు. దేశంలోనే కాకుండ బంగ్లాదేశ్ సహా అనేక దేశాలలో ప్రదర్శనకు హాజరయ్యారు. స్థానికంగా ఉత్పత్తుల ద్వారా వాటిని నిత్యం ప్రజలు ఉపయోగించే వస్తువులను తయారుచేయడంలో శిక్షణ ఇచ్చి వారిని తయారీ రంగం వైపు తీసుకెళ్తున్నారు.
– కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ గారిచే జారీ చేయబడినది.




