అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌, ‌బీజేపీల్లో అసంతృప్తి బీఆర్‌ఎస్‌లో నైరాశ్యం..

‘‘‌కొత్త అభ్యర్ధులను ప్రకటించిన హైదరాబాద్‌, ‌మల్కాజిగిరి, జహీరాబాద్‌ ‌విషయంలో మాత్రం ఆ పార్టీలోని సీనియర్‌ ‌నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఎంతో లాయల్‌గా ఉండే మురళీధర్‌రావు లాంటి సీనియర్‌ ‌నాయకుడుకూడా అభ్యర్ధుల ఎంపిక విషయంలో  అసంతృప్తికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ముఖ్యంగా మల్కాజిగిరి, హైదరాబాద్‌ ‌స్థానాలకు ఎంపిక చేసిన అభ్యర్ధులపట్ల ఆయనతోపాటు మరో సీనియర్‌నేత రాజాసింగ్‌కూడా తమ ఆవేదన  వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ‌పాత బస్తీలో దశాబ్దాలుగా ఎంఐఎంను ఎదుర్కుంటూ, వివిధ సందర్భాల్లో జైళ్ళకు వెళ్ళి, అక్కడ పార్టీని నిలబెట్టిన వారిని కాదని, కనీసం పార్టీ సభ్యత్వం కూడాలేని డాక్టర్‌ ‌మాధవీలతను ఎంపిక చేయడం వారిని అసహనానికి గురిచేసింది.’’

లోకసభ ఎన్నికల్లో పోటీకి అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌పార్టీలు కొన్నిపేర్లను ప్రకటించగా కాంగ్రెస్‌ ఇం‌కా సమాలోచనలు చేస్తోంది. అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లు లీక్‌ అవుతుండడంతో టికట్‌ అశించినవారిలో తీవ్ర అసంతృప్తి మొదలైంది. ముఖ్యంగా దశాబ్దకాలం తర్వాత అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌లో ఈ అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తున్నది. దశాబ్ధకాలంగా అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ  పార్టీ జండాను మోస్తూ వొచ్చిన తమను కాదని, ఇతర పార్టీలనుండి వొచ్చినవారికి ప్రాధాన్యమివ్వడంపట్ల సీనియర్‌ ‌నేతలు కొందరు అసంతృప్తికి గురి అవుతున్నారు. ఫలితంగా కొత్తగా పార్టీలో చేరినవారికి, పార్టీని అంటిపెట్టుకుని ఉన్నావారికి మధ్య తీవ్ర విభేదానికి• దారి తీస్తున్నది. అలాగే ఒక కుటుంబానికి ఒకే పదవి అన్న సూత్రాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ గత ఎన్నికల్లోనే తిలోదకాలు ఇచ్చింది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో కూడా అదే విధానాన్ని అనుసరించడం సరైందికాదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. ఇప్పటికే పదవులు అనుభవిస్తున్న వారి కుటుంబ సభ్యులకే మళ్ళీ మళ్ళీ అవకాశాలు కల్పిస్తే తమకు ఇంకా ఎప్పుడు అవకాశం లభిస్తుందన్నది వారి ప్రశ్న. ఒకపక్క ఎట్టి పరిస్థితిలో  కనీసం పదిస్థానాలనైనా గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది రాష్ట్ర కాంగ్రెస్‌.

అం‌దుకు సమర్థులు, అంగ, అర్థబలం ఉన్నవారిని ఎంపిక చేసుకునే పనిలో పడింది. ఈ మేరకు అభ్యర్ధులనుండి ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తుల ఒడపోత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురేసి అభ్యర్థులను ముందుగా ఎంపిక చేసిన పార్టీ నాయకత్వం, తర్వాత ఇద్దరిని, చివరకు వారిలో ఒకరిని ఎంపిక చేసుకునే ప్రక్రియలో ఉంది. అయినప్పటికీ సీనియర్‌ ‌నాయకులు కొందరు తమ కుటుంబసభ్యులకు టికట్లు ఇప్పించుకోవాలన్న ప్రయత్నాలు ఒకవైపు, పార్టీలో కొత్తగా చేరినవారికి పార్టీ టికట్లు దక్కనున్నాయన్న  వార్తలు ఎంతో కాలంగా పార్టీ టికట్‌పై ఆశపెట్టుకున్నవారిని తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. ముఖ్యంగా ఇటీవల బిఆర్‌ఎస్‌నుంచి వొచ్చిన బొంతు రామ్మెహన్‌, ‌కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, నీలం మధు పేర్లు వెలుగు చూస్తుండడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే నల్లగొండలో సీనియర్‌ ‌నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి లేదా ఆయన కుమారుడు రఘువీరారెడ్డి టికట్‌కోసం ప్రయత్నం చేసుకోవడం, భువనగిరి టికట్‌ ‌కోమటిరెడ్డి బ్రదర్స్ ‌తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇప్పించుకునే ప్రయత్నం, అలాగే ఖమ్మంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన సతీమణి నందినికి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాదరెడ్డికి, అలాగే తుమ్మల  నాగేశ్వర్‌రావు తన తనయుడికి టికట్లు ఇప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పార్టీని ఎంతోకాలంగా అంటిపెట్టుకున్న నాయకులు అసంతృప్తికి గురవుతున్నారు.

అలాగే బిజెపిలో కూడా ఇదే వరుస కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా 195 స్థానాలకు తమ అభ్యర్ధులను ప్రకటించిన బిజెపి తెలంగాణలో తొమ్మిది స్థానాలను ప్రకటించింది. అందులో ముగ్గురు సిట్టింగ్‌లు కావడంవల్ల వారిపై పెద్దగా అసంతృప్తి లేదు. కాని, కొత్త అభ్యర్ధులను ప్రకటించిన హైదరాబాద్‌, ‌మల్కాజిగిరి, జహీరాబాద్‌ ‌విషయంలో మాత్రం ఆ పార్టీలోని సీనియర్‌ ‌నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఎంతో లాయల్‌గా ఉండే మురళీధర్‌రావు లాంటి సీనియర్‌ ‌నాయకుడుకూడా అభ్యర్ధుల ఎంపిక విషయంలో  అసంతృప్తికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ముఖ్యంగా మల్కాజిగిరి, హైదరాబాద్‌ ‌స్థానాలకు ఎంపిక చేసిన అభ్యర్ధులపట్ల ఆయనతోపాటు మరో సీనియర్‌నేత రాజాసింగ్‌కూడా తమ ఆవేదన  వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ‌పాత బస్తీలో దశాబ్దాలుగా ఎంఐఎంను ఎదుర్కుంటూ, వివిధ సందర్భాల్లో జైళ్ళకు వెళ్ళి, అక్కడ పార్టీని నిలబెట్టిన వారిని కాదని, కనీసం పార్టీ సభ్యత్వం కూడాలేని డాక్టర్‌ ‌మాధవీలతను ఎంపిక చేయడం వారిని అసహనానికి గురిచేసింది. అలాగే అందరూ ఎంతో ప్రిస్టేజీగా భావిస్తున్న  మల్కాజిగిరి స్థానంనుంచి పోటీకి ఈటల  రాజేందర్‌ను ఎంచుకోవడంపట్ల  స్థానిక బిజెపి నేతల్లో అసహనానికి గురిచేసింది. పైకి పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటామంటూనే తమ అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. ఇక జహీరాబాద్‌ ‌విషయంలో అక్కడి బిఆర్‌ఎస్‌ ‌సిట్టింగ్‌ ఎం‌పి బీబీ పాటిల్‌ ‌పార్టీ మారడం, తిరిగి ఆయన్నే పోటీలో నిలబెట్టడం చాలాకాలంగా అవకాశంకోసం ఎదురుచూస్తున్న వారి అశకు అడ్డుకట్ట వేసినట్లు అయింది. ఒకనాడు హైదరాబాద్‌లో టైగర్‌గా పేరు తెచ్చుకున్న ఆలె నరేంద్ర కుమారుడు ఆలె భాస్కర్‌ ఇక్కడ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అలాగే మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు బైపాల్‌రెడ్డికూడా తనకు అవకాశం వొస్తుందేమోనన్న ఆశపెట్టుకున్నాడు.

బిఆర్‌ఎస్‌ ‌విషయానికొస్తే గతంలో ఆ పార్టీనుండి పోటీచేసేందుకు పోటాపోటీ పడినవారంతా నిరుత్సాహానికి గురి అవుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపిలు పార్టీ వీడిపోగా, మరి కొందరు అవకాశం కోసం చూస్తున్నట్లు వార్తలు వొస్తున్నాయి. కాగా సిట్టింగ్‌లు మరోసారి పోటీచేసే విషయంలో వెనుకాడుతున్నారు. వారిలో చేవెళ్ళ ఎంపి రంజిత్‌రెడ్డి పేరు వినిపిస్తున్నది. దీంతో కొత్తవారికోసం ఆ పార్టీ అన్వేషణ ప్రారంభించింది.  కాగా సోమవారం బిఆర్‌ఎస్‌ ‌పార్టీ నలుగురు అభ్యర్ధుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఇందులో మహబూబాబాద్‌ ‌సిట్టింగ్‌ ఎం‌పి మాలోతు కవిత, ఖమ్మం నుండి నామా నాగేశ్వర్‌రావులు కాగా, పెద్దపల్లి నుండి కొప్పుల ఈశ్వర్‌, ‌కరీంనగర్‌ ‌నుండి మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్‌ల పేర్లను ప్రకటించింది.
image.png
 -మండువ రవీందర్‌రావు
సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *