అభివృద్ధే మా మంత్రం బిజెపి విజయం తథ్యం బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 23: అభివృద్ధి మా మంత్రం, బిజెపి విజయం తథ్యమని బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పేర్కొన్నారు. గురువారం హయత్నగర్ డివిజన్ శుభోదయ కాలనీ  బిఆర్ఎస్ నాయకులు నర్సింహా  ఆధ్వర్యంలో 50మంది కాలనీ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నాయకత్వంలో బీజేపీ పార్టీలో  చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫి, నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్,500 రూపాయలకే ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్, అర్హులైన వారికి 4000 రూపాయల పెన్షన్, పేద వారి ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల వరకు ఆర్థిక సహాయం, అంబేద్కర్ అభయ హస్తం కింద ప్రతి ఎస్సీ కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అంటూ వివరించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం నేడు అప్పులపాలైంది అని,తెలంగాణ సంపాదన అంత కాంట్రాక్ట్ ల పేరుతో దోచుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *