అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకు నాంది

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 3 : అభివృద్ధి సంక్షేమ పథకాలే తన గెలుపుకు నాంది పలుకుతాయని బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ అన్నారు. గెలుపే ధ్యేయంగా గుర్క జైపాల్ యాదవ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శుక్రవారం కడ్తాల మండలంలోని రేఖ్య తాండ గ్రామపంచాయతీలో స్థానిక జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ ను గిరిజనులు తమ సాంప్రదాయ దుస్తులు ధరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు గుర్తింపు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్త, మండల అధ్యక్షుడు కంబాలపల్లి పరమేష్, వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపిటిసి గోపాల్, మంజుల, చంద్రమౌళి, రైతు కోఆర్డినేటర్ వీరయ్య,  బాలకృష్ణ, నరసింహ,  సర్పంచులు హరిచంద్, లక్ష్మీ నరసింహ రెడ్డి,  కమ్లి, బాలాజీ, సులోచన సాయిలు,  కృష్ణయ్య, భాగ్యమ్మ, జంగయ్య,  మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *