అభివృద్ధి సంక్షేమ పథకాలే జైపాల్ యాదవ్ గెలుపుకు  నాంది

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకు నాంది పలుకుతాయని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తలకొండపల్లి మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండలంలోని వెల్జాల్ గ్రామంలో జైపాల్ యాదవ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహంచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధి. పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి జైపాల్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్, రంగారెడ్డి జిల్లా కో ఆప్షన్ మెంబర్ ముజిబూర్ రెహమాన్, గ్రామకమిటి అధ్యక్షుడు. శ్రీకాంత్ యాదవ్, బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *